KTR: సుమతీ శతకం పద్యంతో కేటీఆర్ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్...తరువాత వెంటనే తెలంగాణ భవన్లో ఇచ్చిన స్పీచ్ రెండూ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ సుమతీ శతకంలోని కనకపు సింహాసం అన్న పద్యం పెట్టారు. అది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. By Manogna alamuru 26 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KTR: తెలంగాణ భవన్లో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ పతకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అంతకు ముందు ఆయన చేసిన ట్వీట్ కూడా తెగ వైరల్ అయింది. కనకపు సింహాసంమీద... ఎప్పుడో సుమతీ శతకంలో బద్దెన రాసిన ఈ పద్యం ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. దానికి కారణం కేటీఆర్. ఈరోజు కేటీఆర్ తన ట్విట్టర్లో ఎప్పుడో పెద్దలు చెప్పినట్టు అంటూ కనకపు సింహాసం మీద అనే పద్యాన్ని పోస్ట్ చేశారు. మంచి ముహూర్తం చూసి కుక్కను సీట్లో కూర్చోబెట్టినా దాని మనసు మారదు. ఇది పెట్టి తానేమీ అనవసరంగా నోరు పారేసుకోలేదని కూడా స్పష్టత ఇచ్చారు. రేవంత్ రెడ్డి అహంకారం, వెకిలి వ్యవహారం చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారు..మేము అధికారంలో ఉన్నామనుకొని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవని కేటీఆర్ అన్నారు. మీకు చేతనైతే ఇచ్చిన 420 అమలుపరచండి.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచండి.ప్రజల దృష్టిని మరలచే ప్రయత్నాలు ఎన్ని చేసిని ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేదాకా వెంటాడుతామని కేటీఆర్ హెచ్చరించారు. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు 👇 pic.twitter.com/G1Xl7AEeHt — KTR (@KTRBRS) January 26, 2024 Also Read:ఫ్రాన్స్ అధ్యక్షుడికి రామ్ లల్లా విగ్రహాన్ని కానుకగా ఇచ్చిన ప్రధాని మోడీ కాంగ్రెస్- బిజెపి కుమ్మక్కు ప్రజలందరికీ తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. ఒకటే రోజు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు ఒకటే బులిటిన్ ద్వారా రాజీనామా ఆమోదించారు. ఒకటే కోట కింద ఉన్న ఎమ్మెల్సీలకి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించారు.రేవంత్ రెడ్డి పోయి అమిత్ షాను కలవగానే ఓకే ఎన్నిక కాకుండా వేరువేరుగా ఎన్నికలు జరిగేటట్టు నిర్వహించారు. ఒకేసారి ఎన్నిక జరిగితే ఒకటి బి ఆర్ ఎస్ కి, మరొకటి కాంగ్రెస్ కి వచ్చేది...కానీ అలా చేయలేదు. అక్కడే తెలిపోతోంది ఆ రెండు పార్టీలు కుమ్మక్కయినట్టు అన్నారు కేటీఆర్. బిజెపి కాంగ్రెస్ కి జాకీలు పెట్టి మద్దతుగా నిలుస్తున్నది.కాంగ్రెస్- బిజెపికి ఫెవికాల్ బంధమని ప్రజలకు తెలుస్తుంది. బండి సంజయ్ కూడా మొన్న కాంగ్రెస్ ,బిజెపి కొట్లాడుకోవద్దు బిఆర్ఎస్ అంతం చూద్దామని చెప్పారు. నిన్న గుంపు మేస్త్రి కూడా ఇదే మాట చెప్పారు అంటూ కేటీఆర్ విమర్శించారు. తమిళి సై మీదా విరుచుకుపడ్డ కేటీఆర్... గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్... ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ గారిని గత ప్రభుత్వం నామినేట్ చేస్తే... రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వన్ని తిరస్కరించింది. కానీ ఈరోజు వస్తున్న వార్తలు ప్రకారం ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాం గారిని ఎట్లా ఆమోదిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు.. రాజభవన్ నడుస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యులు కాదు ప్రజలకు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని విమర్శించారు. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యంకు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు కనిపించడం లేదు.కాంగ్రెస్ బిజెపికి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా అనే విషయం చెప్పాలి. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్ బిజెపిలో కుమ్మక్కును తెలియజేస్తుందని కేటీఆర్ అన్నారు. #brs #ktr #telangana #cm-revanth-reddy #social-media #tweet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి