Telangana : బీఆర్ఎస్‌కు మరో ఎదురు దెబ్బ.. కాంగ్రెస్‌లోకి కోనప్ప

తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, కొమురం భీం జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కోనేరు కోనప్ప ఇదే బాటలో పయనించనున్నారని తెలుస్తోంది.

Telangana : బీఆర్ఎస్‌కు మరో ఎదురు దెబ్బ.. కాంగ్రెస్‌లోకి కోనప్ప
New Update

BRS Leader Koneru Konappa : బీఆర్ఎస్‌(BRS) కు మరో షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్యే, కొమురం భీం జిల్లా(Kumuram Bheem) బీఆర్ఎస్ అధ్యక్షుడు కోనేరు కోనప్ప(Koneru Konappa) పార్టీని వీడి వెళ్ళిపోతున్నట్టు సమాచారం. ఈయన కాంగ్రెస్‌(Congress) లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కలిసి పార్టీలో చేరికను కోనేరు కోనప్ప ఖరారు చేసుకోనున్నారు. సిర్పూర్ నియోజకవర్గం లోని ప్రధాన నాయకులతో కలిసి సీఎంను కలుస్తారని చెబుతున్నారు. జడ్పి వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ తో పాటు, పలువురు ముఖ్య నాయకులతో ఇప్పటికే మంతనాలు జరిగాయని కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉండాలని కోనప్ప వారికి చెప్పారని అంటున్నారు.ఇదివరకే తన ముఖ్య అనుచరున్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన కోనేరు కోనప్ప...ఇప్పుడు ఏకంగా తానే పార్టీలోకి జంప్ చేయడానికి సిద్ధమయ్యారు.

అందుకే వెళ్ళిపోతున్నారు...

కోనప్ప బయటకు రావడానికి కారణం కూడా స్పష్టంగా చెబుతున్నారు. నిన్న బీఎస్పీ తెలంగాణ(BSP Telangana) అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్(RS Praveen Kumar), కేసీఆర్‌(KCR) తో భేటీ కావడమే దీనికి కారణమని చెబుతున్నారు. ప్రవీణ్ పార్టీలోకి వస్తున్నందు వల్లనే కోనప్ప పార్టీని వీడి వెళ్ళిపోతున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో కోనప్ప మీద ప్రవీణ్‌కుమార్ పోటీ చేశారు. కేసీఆర్‌కు తాను ఎంతో గౌరవం ఇచ్చానని...ఇప్పుడు తనతో మాట మాత్రమైనా చెప్పకుండా బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తనను వ్యక్తిగతంగా దూషించిన వారితో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

Also Read : Movies : పూజలో మందు బాటిల్.. వేణు స్వామి కొత్త వింత

#brs #congress #telangana #koneru-konappa #kumuram-bheem-asifabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe