Movies : పూజలో మందు బాటిల్.. వేణు స్వామి కొత్త వింత

వేణు స్వామి... సినిమా వాళ్ళ జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన ఈ వ్యక్తి నాగచైతన్య-సమంత విడాకుల తర్వాత మరింత పాపులర్ అయ్యాడు. ఇతని చేత చాలా మంది హీరోయిన్లు పూజలు కూడా చేయించుకుంటారు. తాజాగా వేణు స్వామి ఓ హీరోయిన్‌తో చేయించిన పూజ బాగా కాంట్రవర్శీ అయింది.

New Update
Movies : పూజలో మందు బాటిల్.. వేణు స్వామి కొత్త వింత

Venu Swami : వింత వింతగా జాతకాలు చెప్పమంటే వేణు స్వామి(Venu Swamy) తరువాతనే. కరోనా(Corona) టైమ్ నుంచి సడెన్‌గా ఫేమస్ అయిన ఈ వ్యక్తి.. సినిమా హీరోలు, హీరోయిన్ల జాతకాలు చెబుతూ కాంట్రవర్శీలు సృష్టిస్తుంటాడు. ఒకటి రెండు సార్లు ఇతను చెప్పినట్టే జరగడంతో మరింత ఫేమ్ వచ్చేసింది వేణు స్వామికి. హీరోయిస్లు, హీరోలు కూడా ఇతనిని నమ్మడం మొదలుపెట్టారు. దీంతో వేణు స్వామికి సెలబ్రటీ స్టేటస్(Celebrity Status) వచ్చేసింది. ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry) లో పెద్దపెద్ద సినీ తారలతో మంచి సాన్నిహిత్యం అయితే ఉంది. ప్రత్యేకంగా వేణు స్వామి కొంతమంది సినీ తారలకు కూడా పూజలు చేయిస్తూ ఉంటారు. రష్మికా లాంటి వాళ్ళు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. తమ కెరీర్ బాగుండాలని వేణు స్వామి చేత యాగాలు, హోమాలు చేయించుకుంటారు.

లిక్కర్‌ బాటిల్ పూజలు..

తాజాగా డింపుల్ హైతీ(Dimple Hayathi) అనే హీరోయిన్ కోసం వేణు స్వామి ఏవో ప్రత్యేక పూజలు చేయించారు. ఉత్త పూజలు అయితే పెద్దగా చెప్పుకోనక్కర్లేదు. కానీ ఇతను చేయించిన పూజలో వైన్ బాటిల్స్ పెట్టడం...ఆ ఫోటోలు బయటకు రావడంతో ఇతను, ఇతని పూజలు మళ్ళీ హాట్ టాపిక్‌గా మారాయి. ఒక ఇంట్లో పెద్ద ముగ్గు...దాని నిండా పూలు, పళ్ళు... దాంతో పాటూ వైన్ బాటిల్స్(Wine Bottles) పెట్టి ఉన్నాయి. అక్కడ డింపుల్ హైతీలో వేణు స్వామి ఏవో పూజ చేయిస్తున్నాడు. రామబాణంలో కనిపించిన డింపుల్ హయతి తన కెరీర్ మంచిగా ఉండడం కోసం ఇతనితో పూజ చేయించుకుంది. అయితే పూజలో ఇలా వైన్స్ బాటిల్స్ పెట్టడమే ఇప్పుడు వింతగా మారింది. ఈ పూజ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దాంతో వైన్ బాటిల్స్ పెట్టి పూజలు చేయడం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నలు అడుగుతున్నారు.

నాకలవాటే..

అయితే ఈ పూజల గురించి వేణు స్వామి క్లారటీ ఇచ్చారు. అవి మందు బాటిల్సే అని ఒప్పుకున్నారు. తాను చేయించే పూజలలో చాలావరకు వైన్ లేదా కూల్ డ్రింక్ తీర్థం లాగా తీసుకుంటారు అని, ఇది ఒక రకమైన పూజ అని చెప్పిన వేణు స్వామి మంచినీళ్లలో కలిపి లిక్కర్ ను ఇస్తాను అని..ఎవరు ఏ బ్రాండ్ తాగితే ఆ తరహా బాటిల్ అక్కడ ఉంటుంది అని చెబుతున్నారు. తాను ఎక్కువగా రాజ శ్యామల, తార, చిన్న మస్త, వామాచార పూజలుచేస్తానని.. ఈ తరహా పూజలకు లిక్కర్ వాడతారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక డింపుల్ హాయతి తన కెరీర్ కోసం ఈ పూజ చేయించుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ లేదు. అందుకే ఇలాంటి పూజలు చేయించుకుందని అంటున్నారు. మరి ఇవి ఆమెకు సక్సెస్‌ను తెచ్చిపెడతాయో లేదో చూడాలి.

publive-image

Also Read : AP Farmers : రైతులకు జగన్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. ఇవాళ అన్నదాతల ఖాతాలలో డబ్బులు జమ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు