Telangana : ఆ స్థానాల్లో బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థులుగా వినోద్, కొప్పుల ఈశ్వర్

మాజీ సీఎం కేసీఆర్‌ఈరోజు మధ్యాహ్నం .. బీఆర్‌ఎస్‌ భవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా వినోద్‌ కుమార్‌, పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ల పేర్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం.

New Update
Telangana : ఆ స్థానాల్లో బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థులుగా వినోద్, కొప్పుల ఈశ్వర్

Vinod - Koppula Eshwar : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) దగ్గరికొస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల కోసం.. పార్టీల పెద్దలు కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఓటమిని ఎదుర్కొన్న బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party).. ఎంపీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఇందుకోసం అభ్యర్థుల కోసం మంతనాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(Ex. CM KCR).. బీఆర్‌ఎస్‌ భవన్‌కు చేరనున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి, కరీంనగర్(Karimnagar) ఎంపీ స్థానాలపై సమీక్ష జరపనున్నట్లు సమాచారం.

Also Read : రైతులకు శుభవార్త.. మరో పదిరోజుల్లో రైతుబంధు పంపిణీ పూర్తి చేసేలా రేవంత్‌ ఆదేశం..

అయితే కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా వినోద్‌ కుమార్‌(Vinod Kumar) ను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. అలాగే పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌(Koppula Eshwar) ను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇదిలాఉండగా.. బీజేపీ పార్టీ 9 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఇతర స్థానాల ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించునుంది.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎంపీ అభ్యర్థుల కోసం కసరత్తులు మొదలుపెట్టింది. గెలుపు గుర్రాల కోసం పార్టీ సీనియర్ నేతలు, హైకమాండ్‌తో చర్చలు జరుపుతోంది. ఇటీవల విడుదలైన పలు సర్వేలు కూడా ఎంపీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ఫలితాలను విడుదల చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. 9 నుంచి 10 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతున్నట్లు అంచనా వేశాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎంపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటి ఉండనుంది.

Also Read : మరో పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండాలి.. ఏపీ హైకోర్టులో పిల్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు