/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-27T172037.726-jpg.webp)
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కొత్తగా ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను తెరిచారు. ఈ నేపథ్యంలో వచ్చిరాగనే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కరెంటు పోవడం లేదని.. సీఎం, డిప్యూటీ సీఎంలు రోజూ అంటున్నారని.. వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని కేసీఆర్ ఆరోపించారు. గంట క్రితం మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంట్ పోయిందని తెలిపారు.
Also read: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు
అలాగే నియోజకవర్గాల్లో కూడా ప్రతిరోజూ పదిసార్లు కరెంటు పోతుందని మాజీ ఎమ్మెల్యేలు కూడా తనతో చెప్పినట్లు గుర్తుచేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముందంటూ నిలదీశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది.
ప్రతి రోజు…
— KCR (@KCRBRSPresident) April 27, 2024
Also Read: టెట్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా మాక్ టెస్టులు