Cinema News: కమెడియన్ ఆస్తుల విలువ 500 కోట్లు...ఎవరో తెలుసా?

ఆయన ముకం చూస్తే నవ్వుతారు...స్క్రీన్ మీద కనిపిస్తే పొట్టచెక్కలు అవ్వాల్సిందే. తెలుగు సినిమాలలో పుట్టాన ఆ హాస్యం ప్రపంచదేశాలను కూడా నవ్వించింది. ఈ కమెడియన్ తన నవ్వులతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. అంతేకాదు అత్యంత ధనవంతుడిగా రికార్డ్ సాధించారు. ఆయన ఎవరో మీకు తెలుసా...

New Update
Cinema News: కమెడియన్ ఆస్తుల విలువ 500 కోట్లు...ఎవరో తెలుసా?

Brahmanandam: తెలుగు సినిమా హాస్యానికి కేరాఫ్ అడ్రస్ బ్రహ్మానందం.67 ఏళ్ళ ఐకానిక్ స్టార్ బ్రహ్మానందం ఇప్పటి వరకు 1000 చిత్రాలలో కనిపించారు. జీవించి ఉన్న న‌టుల్లో అత్యధిక సినిమాల్లో న‌టించిన న‌టుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను  నెలకొల్పారు. కళకు ఆయన చేసిన కృషికి గాను 2029లో పద్మశ్రీ అందుకున్నారు. అయితే ఇప్పుడు దానికన్నా బ్రహ్మి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం...ఆయన ఆస్తుల గురించి. భారతదేశ అత్యంత సంపన్న కమెడియన్ ఎవరు అంటే బ్రహ్మానందం (Brahmanandam) అని చెబుతున్నారు. సుమారు 500 కోట్ల ఆస్తులు ఆయనకున్నాయని చెబుతున్నారు.

రీసెంట్‌గా కపిల్ శర్మ (Kapil Sharma), భారతీ సింగ్‌ (Bharti Singh)లు బాగా డబ్బున్న కమెడియన్లు అంటూ డిబేట్ జరిగింది. కపిల్ నికర ఆస్తుల‌ విలువ రూ. 300 కోట్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. అలాగే బారతీ సింగ్ ఆస్తుల విలువ కూడా కోట్లలోనే ఉంటుందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరికన్నా మరొక అత్యంత సంపస్న కమెడియన్ ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. తాజా స‌మాచారం మేర‌కు.. కపిల్ శర్మ, భారతీ సింగ్ ఎంత గొప్ప సంపాద‌కులో అంత‌కంటే గొప్ప సంపాద‌కుడు బ్రహ్మానందం అని విశ్లేష‌కులు చెబుతున్నారు. క‌పిల్ శ‌ర్మ వంటి వారు పాపుల‌ర‌వ్వక ముందే బ్రహ్మానందం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హాస్య నటులలో ఒకరిగా రికార్డుల‌కెక్కారు. బ్రహ్మీ ఒక్కో సినిమా కోసం రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల వరకు తీసుకునేవారు. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల కోసం కోటి రూపాయల వరకు వసూలు చేస్తార‌ని స‌మాచారం ఉంది.

బ్రహ్మానందం కార్ గ్యారేజీలో ఉన్న బ్రాండెడ్ కార్ల విలువ కూడా చాలా ఎక్కువ‌. బ్లాక్ ప్రీమియం మెర్సిడెస్ బెంజ్‌, ఆడి R8, ఆడి Q7 ఆయ‌న సొంతం. అంతేకాకుండా కోట్లాది రూపాయ‌ల విలువ చేసే వ్యవసాయ భూమి ఆయ‌న‌కు ఉంది. బ్రహ్మానందంకు హైదరాబాద్‌లోని ప్రైమ్ ఏరియాలో సొంత ఇళ్ళు ఉన్నాయి.

ఒక వడ్రంగి కొడుకు అయిన బ్రహ్మానందం కాలేజ్ లెక్చరర్ గా కెరీర్ సాగించారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చి తెలుగు సినీ హాస్యాన్ని దేశదేశాలకూ పాకించారు. బ్రహ్మానందం 1985లో DD తెలుగులో పకపకలుతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టాడు. శ్రీ తాతావతారం ఆయన నటించిన మొదటి సినిమా. ఆ తర్వాత సత్యాగ్రహం, అహనా పెళ్లంట స‌హా ఎన్నో చిత్రాల్లో న‌టించారు. హాస్య బ్రహ్మీ 35 సంవత్సరాలకు పైగా కెరీర్‌లో ఆరు రాష్ట్ర నంది అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సౌత్ .. ఆరు సినీ మా అవార్డులను గెలుచుకున్నారు.

Also Read: శుభ శ్రీ ఎలిమినేటెడ్.. సీక్రెట్ రూమ్ కు వెళ్ళింది వీళ్ళే ..?

Advertisment
Advertisment
తాజా కథనాలు