JR NTR : ఎన్టీఆర్‌కు హృతిక్‌ స్పెషల్‌ ట్వీట్.. వార్‌-2పై అదిరే అప్‌డేట్

నేడు నందమూరి నటసింహం ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరు ఎన్టీఆర్ కు బర్త్ విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ "యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా, పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.

New Update
JR NTR : ఎన్టీఆర్‌కు హృతిక్‌ స్పెషల్‌ ట్వీట్.. వార్‌-2పై అదిరే అప్‌డేట్

Hrithik Special Tweet :  నందమూరి నటసింహం, మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇలా ఒక్కటేంటి రకరకాల బిరుదులతో అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసిన ఏకైక హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు ఎంతో మంది అభిమానించే హీరోగా గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయడంలో ఎన్టీఆర్ మించిన నటుడు లేరని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. నటన, డాన్స్, వ్యక్తిత్వంతో తాతకు తగ్గ మనవడిగా.. నందమూరి లెగసీనీ కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 20 ఏళ్లకే తన నటనతో మాస్ ఆడియన్స్ ను.. ఓ ఊపు ఊపేసిన నందమూరి నటసింహం జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు.

నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు(NTR Birthday) సందర్భంగా సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. తమ అభిమాన హీరోకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ విష్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.

హృతిక్ రోషన్ ట్వీట్

పుట్టినరోజు శుభాకాంక్షలు @tarak9999!. మీకు ఈరోజు ఎంతో సంతోషకరమైనది ఉండాలి. రాబోయే సంవత్సరంలో పూర్తి యాక్షన్‌ ప్యాక్‌తో సాగాలని కోరుకుంటున్నాను. యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నాను మిత్రమా. మనం కలిసే వరకు మీ ప్రతి రోజను ఆనందంగా, శాంతితో ఉండనివ్వండి😉. పుట్టిన రోజు శుభకాంక్షలు మిత్రమా 🙏🏻అంటూ ట్వీట్ చేశారు.

అయితే అయాన్ దర్శకత్వంలో రాబోతున్న వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ షెడ్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా హృతిక్ చేసిన ట్వీట్ తో .. వార్ 2 లో తారక్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించడం కన్ఫమ్ అన్నట్లు అర్థమైంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

HBD Jr NTR : ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్ వరల్డ్ లోనే నంబర్ వన్! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు