Shah Rukh Khan: ప్రస్తుత రోజుల్లో సినిమాలు తీయడం ఎంత ముఖ్యమో..ప్రేక్షకులను థియేటర్లుకు రప్పించడం కూడా అంతే ముఖ్యం. దాని కోసం డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు చాలా కష్టపడతారు. ఎక్కడ కావాలంటే అక్కడ ప్రీ రీలిజ్ ఈవెంట్లు కూడా ఏర్పాటు చేస్తారు. అభిమానులతో మాట్లాడతారు. వారి సినిమాను ప్రేక్షకుల్లోనికి తీసుకుని వెళ్లడానికి సినిమా యూనిట్ మొత్తం చాలా కష్టపడుతుంది.
చిన్న సినిమాలే హీరోలే ఇలా చేస్తారు అనుకుంటే పొరపాటే..ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలైన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్ర బృందం కూడా పక్క రాష్ట్రాల్లో కూడా వారి చిత్రానికి ప్రమోషన్స్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్ షా షారూక్ నటించిన జవాన్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
పఠాన్ (Patan) చిత్రం ద్వారా భారీ వసూళ్లను రాబట్టిన షారూక్(Shah Rukh Khan) ..జవాన్‌తో ఆ రికార్డును బద్దలుగొట్టాడానికి రెడీ అయ్యాడు. ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా జవాన్(Jawan) విడుదల కాబోతుంది. జవాన్ సినిమాకు ఇప్పటికే ప్రీ టికెట్ బుకింగ్స్ జరిగిపోతున్నాయి. సినిమా విడుదల కావడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉన్నప్పటికీ రెండున్నర లక్షల టికెట్లు బుక్ అయినట్లు టాక్ .
ఈ క్రమంలోనే షారూక్ అభిమానులతో సోషల్ మీడియా (Social Media) ద్వారా ముచ్చటించారు. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం కూడా చెప్పారు. ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంటే..ఓ అభిమాని షారూక్ ని రెండు టికెట్లు ఫ్రీగా కావాలని..అవి ఇప్పిస్తే తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి సినిమాకి వెళ్తానని చెప్పాడు.
దాంతో షారూక్ ఆ అభిమానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు...అది ఏంటి అంటే..ప్రేమ ఫ్రీగా దొరుకుతుంది ఏమో కానీ సినిమా మాత్రం పైసల్ పెట్టి చూడాల్సిందే. రొమాన్స్ కూడా ఛీప్ గా దొరకాలంటే ఎలా బ్రదర్..? వెళ్లి డబ్బులతో టికెట్లు కొని నీ గర్ల్ ఫ్రెండ్ ని కూడా తీసుకుని వెళ్లి ఇద్దరూ కలిసి సినిమాను ఎంజాయ్ చేయండంటూ వడ్డించారు. మరి షారూక్ తో పెట్టుకుంటే ఆ మాత్రం ఉంటుంది మరి.
Also Read: షార్‌లో విషాదం.. వాయిస్ ఆఫ్ ఇస్రో, శాస్త్రవేత్త వలర్మతి ఇక లేరు!