/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kharge-1-jpg.webp)
Mallikharjun Kharge: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ (Arrest) చేయడం గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Kharge) స్పందించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను రాజీనామా చేయాలని ఈడీ ఒత్తిడి చేయడం ఫెడరలిజానికి పెద్ద దెబ్బ అంటూ ఖర్గే పేర్కొన్నారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ (Money Landering) ఆరోపణ లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఈడీ బుధవారం సాయంత్రం అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో బీజేపీ గురించి ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. '' మనీ లాండరింగ్ నిరోధక చట్టం లోని నిబంధనలను కఠినంగా మార్చడం తో ప్రతిపక్ష నేతలను భయపెట్టడం అనేది బీజేపీ టూల్ కిట్ లో ఓ భాగంగా మారిందని ఆయన ఆరోపించారు''.
जो मोदी जी के साथ नहीं गया, वो जेल जाएगा।
झारखंड के मुख्यमंत्री, श्री हेमंत सोरेन पर ED लगाकर उनका त्यागपत्र देने को मजबूर करना Federalism की धज्जियाँ उड़ाना है।
PMLA के प्रावधानों को draconian बनाकर विपक्ष के नेताओं को डराना-धमकाना, भाजपा की Tool Kit का हिस्सा है।
षड्यंत्र…
— Mallikarjun Kharge (@kharge) January 31, 2024
అంతేకాకుండా..'' బీజేపీ వాషింగ్ మెషీన్ లోకి వెళ్లినది తెల్లగా ఉంది. ఏది కలుషితం కాలేదు? ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం నుంచి రక్షించాలంటే..బీజేపీని ఓడించాలి. దేనికి కూడా భయపడేది లేదు..పార్లమెంట్ నుంచి మేము పోరాడుతూనే ఉంటామని'' ఖర్గే పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వ సంస్థలుగా పని చేయడం లేదు...బీజేపీకి ''ఎలిమినేట్ ప్రతిపక్ష సెల్ '' గా మారాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతే కాకుండా రాహుల్ తన ఎక్స్ ఖాతాలో '' అవినీతిలో కూరుకుపోయిన ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేయడానికి ప్రచారం చేస్తోందని'' అరోపించారు.
ED, CBI, IT आदि अब सरकारी एजेंसियां नहीं रहीं, अब यह भाजपा की ‘विपक्ष मिटाओ सेल’ बन चुकी हैं।
खुद भ्रष्टाचार में डूबी भाजपा सत्ता की सनक में लोकतंत्र को तबाह करने का अभियान चला रही है।
— Rahul Gandhi (@RahulGandhi) January 31, 2024
Also read: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్..నెక్స్ట్ సీఎం?