Telangana: RRR మూవీ కలెక్షన్లను దాటిన RR ట్యాక్స్.. రేవంత్ సర్కార్ పై మోదీ ఎటాక్

కరీంనగర్‌లో ఈసారి బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ విజయం పక్కా అనిపిస్తోంది అన్నారు ప్రధాని మోదీ. బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. అంతకుముందు వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

New Update
RRR Tax: తెలంగాణలో RR ట్యాక్స్ కాదు RRR ట్యాక్స్ నడుస్తోంది.. మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi Vemulawada Public Meeting:తెలంగాణ జిల్లాల్లో ప్రధాని మోదీ ఈరోజు పర్యటిస్తున్నారు. ముందు కరీంనగర్ వేములవాడలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ...తరువాత వరంగల్ జిల్లాలో సబలో పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన రాజ్ భవన్ లో కాసేపు విశ్రాంతి తీసుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వేములవాడకు చేరుకున్నారు. అక్కడ రాజన్నను దర్శించుకున్న తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చాను. గత పదేళ్ళలో తానేం చేశానో అందరూ చూశారు. ఎన్డీయే పాలనలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఈసారి ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) కూడా తమ గెలుపు ఖాయమన్నారు ప్రధాని.

కరీంనగర్‌లో బీజేపీదే గెలుపు..

కరీంగనర్‌లో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) ఓటమి కచ్చితం అన్నారు మోదీ. ఆ రెండు పార్టీలకు కుటుంబమే ముఖ్యం. దేశానికి ఏ మాత్రం ప్రాముఖ్యం ఇవ్వాలి. అవి రెండూ నాణేనాకి బొమ్మా, బొరుసూలాంటివని విమర్శించారు. అవి అవినీతి పార్టీలు. ఇప్పటికే జరిగిన మూడు దశల పోలింగ్‌లలో కాంగ్రెస్ ఓటమి ఖాయం అయిపోయింది. ఇప్పుడు తరువాతి దశల్లో కూడా అదే జరుగుతుంది. మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి (INDIA Alliance) ఫ్యూజ్ ఎగిరిపోయిందని మోదీ కామెంట్స్ చేశారు.

తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపిస్తారని నమ్మకంగా ఉందని అన్నారు ప్రధాని మోదీ. అయోధ్య రామాలయం ద్వారం ఇక్కడ నుంచే వచ్చిందని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపించింది.. అధికారంలోకి వచ్చాక ఆ అవినీతిపై దర్యాప్తు చేయట్లేదు. తెలంగాణ నుంచి దిల్లీ వరకు దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ ట్యాక్సు (RR Tax) పైనే చర్చ జరుగుతోంది. తెలంగాణలోని ఆర్‌ లూటీ చేసి.. దిల్లీలోని ఆర్‌కు ఇస్తున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారన్నారు మోదీ అన్నారు.

Also Read: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా

Advertisment
తాజా కథనాలు