AstraZeneca Withdraws Covid Vaccine : కరోనా బారి నుంచి జనాలను రక్షించేందుకు అన్ని పెద్ద దేశాలు అప్పటి కప్పుడు వ్యాక్సిలను తయారు చేశాయి. మొదటి వేవ్‌లో తగిలిన దెబ్బలకు రెండో వేవ్ సమయానికి వ్యాక్సిలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అమెరికా, భారత్, బ్రిటన్ ఇలా చాలా దేశాలు వ్యాక్సిన్‌సు అప్పటికప్పుడు తయారు చేశాయి. బ్రిటన్ ఫార్మా కంపెనీ అస్ట్రాజెనికా కూడా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి అన్ని దేశాలకూ స్లై చేసింది. అయితే అప్పుడు ఈ టీకా వలన కరోనా నుంచి తప్పించుకోగలిగారు కానీ…తరువాత దీని ప్రభావం వల్ల చాలా మంది బ్లడ్ క్లాట్స్ (Blood Clot) బారిన పడుతున్నారు. అస్ట్రాజెనికా వ్యాక్సిన్ కారణంగా బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కు దారితీసే అవకాశం ఉందని స్వయంగా వ్యాక్సిన్ తయారీదారే ఒప్పుకుంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ (Covishield Vaccine), సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని మన దేశం మొత్తం ఉపయోగించింది. అయితే కోవిషీల్డ్ వల్ల జనాలు థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అనే సిండ్రోమ్‌కు గురవుతున్నారు. దీని కారణంగా శరీరంలో రక్తం గడ్డ కట్టడం లేదా ప్లేట్‌లెట్స్ కౌంట్ వేగంగా పడిపోవడం జరుగుతోంది. శరీరంలో రక్తం గడ్డకట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ లేదా కార్డియాక్ అరెస్ట్ అవుతోందని నిరూపితమయింది.
పూర్తిగా చదవండి..AstraZeneca: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా
ప్రపంచ వ్యాప్తంగా తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది బ్రిటన్ ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా. ఈ టీకా వల్ల రక్తం గడ్డ కడుతోందని వరల్డ్ వైడ్‌గా కేసులు రావడం..బ్రిటన్ కోర్టులో కేసులు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Translate this News: