/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/26-3-jpg.webp)
ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల మీద బీజెపీ నేత అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవిత బీమా పేరుతో ప్రజలకు డబ్బులిస్తానని హామీ ప్రకటించడం పై తీవ్రంగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఇచ్చే జీవిత బీమా ఏమో కానీ...కవితను ఉద్దేశిస్తూ నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా... మీ అన్న చచ్చిపోతే పది లక్షలు ఇస్తా... మీ నాన్న చచ్చిపోతే అని మాట్లాడారు. ఈ కామెంట్స్ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. దాంతో పాటూ ఎమోషన్ కూడా అయ్యారు. ప్రజలారా! మీ ఇంట్లో ఆడబిడ్డలను అంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆడబిడ్డనైన నన్ను అరవింద్ అనే మాటలు మీ ఆడపిల్లలను అంటే మీకు సమ్మతమేనా? నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి, సీఎం కేసీఆర్ బిడ్డను కాబట్టి నన్ను ఏది అన్నా ఒప్పుకుందామా ? తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను అనుమతిద్దామా ? అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిజామాబాదులో ఓడిపోయిన తర్వాత తాను చాలా హుందాగా ప్రవర్తించానని చెప్పుకున్న కవిత...ప్రజలకు తాను చేయగలిగింది చేశానని చెప్పారు. కానీ ఎంపీగా విజయం సాధించిన వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మానేసి తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను నిలదీయడం, విమర్శించడం వరకు ఓకే కానీ మరీ చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా... మీ అన్న చచ్చిపోతే పది లక్షలు ఇస్తా... మీ నాన్న ఇట్లా అనడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. మరీ వ్యక్తిగతంగా ఇలా మాటలు అనడం ఎంతవరకు సమంజసమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను కానీ తమ పార్టీ వారు కానీ ఎప్పుడూ ఇలా అమర్యాదగా, అడ్డదిడ్డంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం టైమ్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ వారిని ఎవ్వరినీ ఇలా అనలేదని అన్నారు. ఓ వ్యక్తిని టార్గెట్ చేసే రాజకీయాలు వద్దని విజ్ఞప్తి చేశారు కవిత.
ఇదేం సంస్కారం అరవింద్! మీ లాంటి బూజు పట్టిన వ్యక్తులను మార్చాల్సిన టైం వచ్చేసింది.మేము మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సమయంలో... నిజామాబాద్ ఎంపీ మాట్లాడిన మాటలు మహిళలను రాజకీయాల్లోకి రాకుండా కట్టడి చేసేలా ఉన్నాయి.
It’s time to challenge outdated mindsets!… pic.twitter.com/tgu3YRCX0P
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 17, 2023
Also Read:ఆసుపత్రిపై దాడి మిలిటెంట్ల పనే- ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు
కవిత సోసల్ మీడియా పోస్ట్ మీద బీజెపీ నేత అరవింద్ మళ్ళీ స్పందించారు. సానుభూతి కోసం కవిత ఎంత తాపత్రయ పడ్డా ప్రయోజనం లేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని ఎంత తిట్టినా తెలంగాణ ప్రజలు బాధపడరని కామెంట్ చేశారు. ఈరోజు నేను ఏదో అన్నానని తెగ బాధపడిపోతున్నారు కరెక్టే కానీ మోడీ నుంచి కిషన్ రెడ్డి వరకూ అందరినీ ఇష్టమొచ్చినట్టు అడ్డమైన భాష వాడి తిట్టిన తిట్ల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం ఎలక్షన్ల టైంలో సుభాషితాలు చెప్తే సానుభూతి రాదన్నారు. కరోని టైమ్ లో తెలంగాణలో అంతమంది చనిపోతే బీఆర్ఎష్ ప్రభుత్వం ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం జీవితబీమా, లక్షలిస్తాం అంటూ కబుర్లు చెబుతున్నారు అని మండిపడ్డారు. అందుకే మీరు చనిపోతే కూడా నేను లక్షలిస్తానని మాట్లాడానని...ఏం చేసుకుంటారో చేసుకోండని అరవింద్ సవాల్ విసిరారు.
మోడీ గారి నుండి కిషన్ రెడ్డి గారి దగ్గర నుండి మా దాకా, అందరి మీద ఇష్టమొచ్చినట్టు అడ్డమైన భాష వాడి, ఇప్పుడు ఎలక్షన్ల ముందు సత్తెపూస లెక్క సుభాషితాలు చెప్తే సానుభూతి వస్తదనుకున్నవా!? తొక్క కూడా రాదు! pic.twitter.com/XTLYgazdHg
— Arvind Dharmapuri (@Arvindharmapuri) October 18, 2023