Social Media: సోషల్ మీడియాలోనూ పోటీలు పడుతున్న పార్టీలు..టాప్‌లో బీజేపీ

దేశంలో ప్రధాన పార్టీలు ప్రజలతో ఇంటరాక్ట్‌ అవ్వడానికి సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నాయి. 2014 నుంచి దీన్ని ఫాలో అవుతున్నా...ఇప్పుడు అది మరింత పెరిగింది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా వాడుకోవడంలో అందరికంటే బీజేపీ ముందంజలో ఉంది.

Social Media: సోషల్ మీడియాలోనూ పోటీలు పడుతున్న పార్టీలు..టాప్‌లో బీజేపీ
New Update

Political Parties In Social Media: నేటి ఆధునిక జీవనశైలిలో సోషల్ మీడియా ఒక పార్ట్‌ అయిపోయింది. ఇది లేకపోతే పొద్దు గడవడం లేదు. అందుకే 2014 నుంచి రాజకీయ పార్టీలు దీని మీద దృష్టిని పెట్టాయి. ఎన్నికలు ఉన్నప్పుడే కాకుండా..మామూలు టైమ్‌లో కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రజలకు చేరువలో ఉండడానిక ప్రయత్నాఉల చేస్తున్నాయి. ప్రధాని మోదీ లాంటివారు అయితే దీన్నే ప్రధాన ఆయుధంగా చేసుకున్నారు కూడా. ప్రస్తుతం ఎన్నికల నేథ్యంలో సోషల్ మీడియాలో యాడ్స్, ప్రచారాలు చేస్తూ దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రారాజు ఎవరు అనే సర్వే జరిగింది. ఇందులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇండియా టుడే యొక్క ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టీమ్ ఈ సర్వేను చేసింది.

గత కొంతకాలంగా బీజేపీ. కాంగ్రెస్ , ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు సోసల్ మీడియా ఖాతాలను పరిశీలించింది. దీంతో పాటు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన రాజకీయ పార్టీల నేతల డేటాను కూడా విశ్లేషించారు. ఈ మొత్తం సర్వేలో బీజేపీనే టాప్ ప్లేస్‌లో ఉందని స్పష్టం అయింది. అయితే కాంగ్రెస్, ఆప్ పార్టీల ఫేస్‌బుక్, ఇన్స్టా పేజీల్లో మాత్రం కొత్త యూజర్లు బాగా పెరుగుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీ కంటే ఈ రెండు పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఇక తృణమూల్ కాంగ్రెస్ హవా మాత్రం తక్కువగానే ఉంది. ఇది దేశంలోనే మూడవ అతి పెద్దగా పార్టీగా ఉన్నా సోసల్ మీడియాలో మాత్రం దీని ప్రబావం అంతంత మాత్రమే అని సర్వే చెబుతోంది.

మోదీని ఢీకొట్టేవారే లేరు..
ఇక రాజకీయ నాయకులు, నేతల విషయానికి వస్తే అందరూ అనుకుంటున్నట్టుగానే సోషల్ మీడియాలో ప్రదాని మోదీ హవా నడుస్తోంది. ఈ ఏడాది అందరు నేతలకూ ఫాలోయింగ్ బాగా పెరుగుతున్నప్పటికీ మోదీని ఢీకొట్టేవారు మాత్రం ఎవరూ లేరు. జనవరి, ఫిబ్రవరిలలో ప్రతి నెలా 1.2 లక్షల మందిఫాలోవర్స్ బిజెపి ఖాతాలో జాయిన్ అవుతున్నారు. కానీ ఒక్క మార్చిలో మాత్రమం ఏకంగా 1.7 లక్షల మంది కొత్త యూజర్లు జాయిన్ అయ్యారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో కాంగ్రెస్ పార్టీకి జనవరిలో 59 వేలు, ఫిబ్రవరిలో 70 వేలు, ఇంకా మార్చిలో 1.08 లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు.

యూట్యూబ్‌లో ఆమ్ ఆద్మీ..

ఇక యూట్యూబ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఆప్ పార్టీదే పైచేయి. కొత్త సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకోవడంలో కాంగ్రెస్, ఆప్ పార్టీలో ముందంజలో ఉన్నారు. మరోవైపు యూట్యూబ్‌లో బీజేపీ రోజురోజుకూ క్షీణిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన యూట్యూబ్ ఛానెల్ మూడు నెలల్లో 5.9 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. మార్చిలో 3.6 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులను చేర్చుకుంది. అదే సమయంలో, ఈ ఏడాది మూడు నెలల్లో బీజేపీ యూట్యూబ్ ఛానెల్‌లో 5.3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు పెరగగా, కాంగ్రెస్ యూట్యూబ్ ఛానెల్‌లో 5 లక్షల మంది సబ్‌ స్క్రైబర్లు పెరిగారు. ఇక టీఎంసీకి అయితే కేవలం 28 వేల మంది యాడ్ అయ్యారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే బీజేపీ సబ్‌స్క్రైబర్లు అయితే పెరగలేదు కానీ వాళ్ళు పోస్ట్చేసిన కంటెంట్‌కు మాత్రం బోలెడన్ని వ్యూస్ వచ్చాయి. మూడు నెలల్లో బీజేపీ వీడియోలకు 43 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వీడియోలకు 30.78 కోట్లు, కాంగ్రెస్ వీడియోలకు 16.69 కోట్ల వ్యూస్ వచ్చాయి.

Also Read:Rahul Gandhi: సీఎం స్టాలిన్ నోటిని తీపి చేసిన రాహుల్ గాంధీ..ఫేమస్ మైసూర్ పాక్ గిఫ్ట్

#congress #bjp #social-media #survey #aap #political-parties
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe