BJP Laxman Interview: ఓట్ల కోసం తాయిలాలు ఇచ్చే పార్టీ మాది కాదు. పేదల కన్నీరు తుడిచే పార్టీ మాది అంటున్నారు తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్. మోదీ (Modi) నిజాయితీ, ప్రజల కోసం ఆయన చేస్తున్న పనులను అందరూ గమనిస్తున్నారని...ఆ నమ్మకంతోనే జనం బీజేపీకి ఓటు వేస్తారని అన్నారు. ఈసారి తెలంగాణలో (Telangana Elections) తమ పార్టీ గట్టి పోటీనిస్తుందని తెలిపారు. అదేవిధంగా పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోవడం చాలా సహజమని లక్ష్మణ్ కొట్టిపారేశారు. దాన్ని అంత సీరియస్ గా తీసుకోనక్కర్లేదని అన్నారు. వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ లాంటి వారని వ్యాఖ్యానించారు. బీజెపీ నుంచి వెళ్ళిపోతున్నవారితో పార్టీకి ఏమీ సంబంధం లేదు. అన్ని పార్టీల్లో ఇది జరగుతోంది. కొంత మంది వెళ్ళిపోతే మరి కొంత మంది వచ్చి చేరుతున్నారన్నారు. బీజెపీ (BJP) మొదట ప్రకటించిన లిస్ట్ లో చాలా మంది కొత్తవాళ్ళే ఉన్నారు. మేము అందరికీ సమన్యాయం జరిగేట్టు చూస్తున్నాం. బాబూ మోహన్, విజయశాంతి వంటి వారి విషయాల్లో కూడా అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని లక్ష్మణ్ తెలిపారు. సెకండ్ లిస్ట్ నవంబర్ 1కు వస్తుందని చెప్పారు.
Also read:బీఆర్ఎస్‌లోకి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్
బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) డీఎన్ఏ ఒకటే. వాళ్ళిద్దరూ ఎప్పటికైనా కలుస్తారు. ఎవరికి ఓటేసినా ఒకటే. బీజెపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను సపోర్ట్ చేయదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో జనసేన (Janasena), బీజెపీ కలిసి పోటీ చేస్తాయి. దీని మీద త్వరలోనే ఒక అభిప్రాయనికి వచ్చి ఎన్ని స్థానాల కోస్ జనసేన పోటీ పడుతుంది అనేది ప్రకటిస్తామని తెలిపారు. టీడీపీతో కలుస్తామన్న వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. జనసేన వేరే రాష్ట్రంలో టీడీతో పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోమని అన్నారు.
Also Read: 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్