Rajagopal Reddy:ఎమ్మెల్సీ కవితపై.. బీజేపీ నేత కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ బీఆర్‌ఎస్‌పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్‌లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్‌లో కేసీఆర్ లేడని, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తున్న సమయంలో కవిత ఎంపీగా లేరన్న ఆయనా.. అయినా ఆ క్రెడిట్ అంతా తమదే అనే విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారన్నారు. By Karthik 19 Sep 2023 in Latest News In Telugu నల్గొండ New Update షేర్ చేయండి బీఆర్‌ఎస్‌పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్‌లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్‌లో కేసీఆర్ లేడని, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తున్న సమయంలో కవిత ఎంపీగా లేరన్న ఆయనా.. అయినా ఆ క్రెడిట్ అంతా తమదే అనే విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారన్నారు. ప్రస్తుతం కవిత ఎంపీగా లేరన్న ఆయన.. ఒకవేళ ఆమె ఎంపీగా లోక్‌సభలో ఉంటే తానే మహిళా బిల్లును పాస్ చేయించినట్లు డప్పు కొట్టకుంటూ చెప్పేవారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే పార్లమెంట్‌లో మహిళా బిల్లు పాస్ అయిందని గొప్పలు చెప్పుకునేవారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వం వల్లే బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును పాస్ చేసినట్లు చెప్పుకుటుంన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. అందులో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదంటున్నారన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మహిళల గురించి ఆలోచించి వారిని కూడా చట్ట సభల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో మహిళా బిల్లును తీసుకు వచ్చారన్నారు. బీజేపీ మహిళలకు పెద్దపీట వేస్తోందన్న ఆయన.. భారత రాష్ట్రపతిగా మహిళను నియమించడం అందుకు ఉదాహారణ అన్నారు. రానున్న రోజుల్లో దేశం అగ్ర దేశాల సరసన నిలిచే అవకాశం ఉందన్నారు. ఇటీవల భారత్‌లో జరిగిన టీ20 సమ్మిట్ విజయవంతం కావడంతో ప్రపంచం దృష్టి భారత్ వైపు మళ్లేలా చేసిందన్నారు. అంతే కాకుండా చద్రయాన్-3 విజయవంతం ద్వారా భారత్ ఆగ్ర దేశాల మధ్య నిలిచిపోయిందని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఏ దేశం చేయని విధంగా ఆదిత్యL1 ప్రయోగానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న రాజగోపాల్ రెడ్డి.. ఈ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇది విజయవంతంగా ముగిస్తే ఇండియా సూర్యుడిపై ప్రయోగాలు చేసిన మొదటి దేశంగా అవతరించనుందన్నారు. #brs #parliament #bjp #mlc-kavitha #cm-kcr #komatireddy-rajagopal-reddy #women-bill మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి