Congress: మా ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తోంది.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తోందని బీహార్ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. తమ 16 మంది ఎమ్మెల్యేలు కాపాడుకునేందుకు వారిని హైదరాబాద్ కు తరలించింది. ఈ నెల 12న బీహార్‌లో నితీష్ కుమార్ బలపరీక్ష ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 04 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Bihar Congress: బీహార్ లో బీజేపీతో (BJP) పొత్తు పెట్టుకొని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు సీఎం నితీష్ కుమార్ (CM Nitish Kumar). ఈ నెల 12న బీహార్‌లో నితీష్ కుమార్ బలపరీక్ష నిరూపించుకోనున్నారు. ఈ క్రమంలో బీహార్ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొంది. ఈ క్రమంలో వారిని కాపాడుకునేందుకు బీహార్ లోని 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించింది. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ALSO READ: రైతు బంధును కాంగ్రెస్ ఆపింది.. హరీష్ రావు ఫైర్! #WATCH | Telangana: The 16 Congress MLAs reach Hyderabad. The floor test of the newly elected NDA government in Bihar is likely to happen on February 12. (Visuals from Hyderabad airport) pic.twitter.com/SELbKPBlPG — ANI (@ANI) February 4, 2024 9వ సారి సీఎంగా నితీష్ కుమార్... బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇండియా కూటమికి బై చెప్పి కాషాయ పార్టీకి హాయ్ చెప్పారు నితీష్ కుమార్ . 9వ సారి బీహార్ సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు. నితీష్‌తో ప్రమాణం చేయించారు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. నితీష్‌తో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు.. హెచ్ఎఎం నుంచి ఒకరు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు లభించాయి. బీజేపీ నుంచి మంత్రులుగా సామ్రాట్ చౌదరి.. విజయ్‌కుమార్ సిన్హా, డాక్టర్ ప్రేమ్ కుమార్ ప్రమాణం చేశారు. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభించాయి. జేడీయూ నుంచి విజయ్ చౌదరి, విజేంద్ర యాదవ్, శ్రవణ్ కుమార్ ప్రమాణం చేశారు. హెచ్ఎఎం నుంచి మంత్రిగా ప్రమాణం చేశారు సంతోష్ సుమన్. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సుమిత్ సింగ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. 2000 నుంచి ఇప్పటివరకు 9వ సారి సీఎంగా నితీష్ ప్రమాణం చేశారు. ఎక్కువ సార్లు సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తిగా నితీష్ భారత చరిత్రలో నిలిచారు. 2000లో వారం రోజులు సీఎంగా పని చేశారు నితీష్.. ఆ తర్వాత నుంచి కూటములు మారుస్తూ.. సీఎంగా ఉంటూ వస్తున్నారు నితీష్ కుమార్. ALSO READ: బొంద పెడుతాం జాగ్రత్త.. రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్ DO WATCH: #congress-mlas #bihar-congress #bihar-cm-nitish-kumar #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి