BJP MP List: బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే!

తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది బీజేపీ హైకమాండ్. ఈ క్రమంలో ఈరోజు తెలంగాణ ముఖ్యనేతలతో బీజేపీ పెద్దలు సమావేశం అయ్యారు. అయితే, 8 మందితో కూడా మొదటి జాబితాను బీజేపీ హైకమాండ్ ప్రకటించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
BJP MP List: బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే!

Telangana BJP MP Candidates List: ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో నిరాశ చెందిన బీజేపీ పార్టీ.. మరికొన్ని నెలల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికలపై (Lok Sabha Elections) ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఉన్న మొత్తం 17 స్థానాల్లో 16 స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో గెలిచే అభర్ధులకే ఎంపీ టికెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.

ఇదిలా ఉండగా తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ నేతలతో ఈరోజు ఢిల్లీలో హైకమాండ్‌ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల రాజేందర్, డీకే అరుణ హాజరయ్యారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేఅభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ను ఫైనల్‌ బీజేపీ హైకమాండ్‌ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. 8 మందితో మొదటి జాబితా ప్రకటించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ లిస్ట్‌లో నలుగురు సిట్టింగ్‌ ఎంపీలకు టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఎంపీ అభ్యర్థులు వీరే?..

* సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌ రెడ్డి
* ఆదిలాబాద్‌-సోయం బాపూరావు
* కరీంనగర్‌- బండి సంజయ్‌
* నిజామాబాద్‌- అర్వింద్‌
* మహబూబ్‌నగర్‌- డీకే అరుణ
* మల్కాజ్‌గిరి- ఈటల రాజేందర్‌
* భువనగిరి- బూర నర్సయ్యగౌడ్‌
* చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

ఇక.. మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్‌ను జితేందర్‌ రెడ్డి ఆశిస్తున్నారు. ప్రస్తుతం జితేందర్‌ రెడ్డిని బుజ్జగించాలని హైకమాండ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయిన రఘునందనరావుకు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు