Telangana: ఓట్ల కొనుగోలుకు రూ.30 కోట్లు.. బీఆర్ఎస్‌పై రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు తెరలేపిదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దీనికి వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

New Update
BJP MP Raghunandan Rao: అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారు: ఎంపీ రఘునందన్‌రావు

BJP Raghunandan Rao On BRS Party: బీఆర్‌ఎస్‌పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ రూ.30 కోట్లతో ఓట్ల కొనగోలుకు తెరలేపిదంటూ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ అధికారిక కెనరా బ్యాంక్ అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జీలకు నగదు బదిలీ చేసిందని అన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.


ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఆయన లేఖలు రాశారు. అలాగే దీనికి బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ కూడా జత చేశారు. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలు ఓట్ల కొనుగోలుకు వాడుతారని అన్నారు. వెంటనే అకౌంట్‌లో డబ్బులు ఫ్రీజ్‌ చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Also Read: తెలంగాణలో రూ.1000 కోట్ల భారీ కుంభకోణం: కేటీఆర్ సంచలన ఆరోపణలు

Advertisment
తాజా కథనాలు