/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-33-1-jpg.webp)
BJP Complaint To EC On KCR & Ponnam Prabhakar: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బండి సంజయ్‌పై కేసీఆర్, పొన్నం దుర్భాషలారని.. వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదులో పేర్కొంది. బండిపై పొన్నం అవినీతి ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అలాగే మాజీ సీఎం కేసీఆర్ బండిపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఈసీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును ఎన్నికల సంఘం స్వీకరించింది. కేసీఆర్, పొన్నం ప్రభాకర్ కు దీనిపై సమాధానం చెప్పాలని నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.