Purandeswari: పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలకు పురందేశ్వరి క్లారిటీ!

ఏపీలో పొత్తులపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. బీజేపీ రాష్ట్ర పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. త్వరలో ఏ పార్టీతో పొత్తు అనేది చెబుతామని అన్నారు.

Purandeswari: పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలకు పురందేశ్వరి క్లారిటీ!
New Update

Daggubati Purandeswari: త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. బీజేపీ అధిష్టానం రాష్ట్ర పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ముగ్గురు నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారని అన్నారు.

ALSO READ: షర్మిలకు ప్రాణహాని.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు

కన్ఫ్యూజన్ లేదు...

ఏపీలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని అన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టాం.. పొత్తులను బట్టి కార్యక్రమాలు చేయడం లేదని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయని అన్నారు. పరిస్థితులను సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసమే కార్యకర్తలు పని చేస్తున్నారని గుర్తు చేశారు.

అప్పుడు స్కామ్ లు.. ఇప్పుడు స్కీమ్ లు.

బీజేపీ కార్యాలయంలో దీన్‌దయాళ్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్‌దయాళ్‌ బీజేపీ మొదటి సిద్ధాంతకర్త అని అన్నారు. చిన్న పరిశ్రమలు నెలకొల్పాలని దీన్‌దయాళ్‌ భావించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను బీజేపీ ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. 2014కు ముందు దేశంలో స్కామ్‌ల వార్తలు విన్నాం అని... మోడీ పాలనలో స్కీమ్‌ల వార్తలు వింటున్నాం అని అన్నారు. కేంద్రంలో అధికారం లోకి వచ్చేది బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి

DO WATCH: 

#modi #amit-shah #purandeswari #ap-latest-news #ap-bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి