Nitish kumar: నిండు సభలో సెక్స్ గురించి మాట్లాడిన నితీశ్ కుమార్!

బిహార్‌ ముఖ్యమంత్రి మంగళవారం నాడు అసెంబ్లీలో సెక్స్‌ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. మహిళల అక్షరాస్యత పెరగడం వల్లే రాష్ట్రంలో జనాభా తగ్గుతుందని ఆయన వ్యాఖ్యనించారు.

New Update
Bihar Crisis: నితీష్ కుమార్ రాజీనామా ఖాయమే..ఆ 48 గంటలు కీలకం..!!

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ .మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి..అసెంబ్లీ జరుగుతున్న సమయంలో చుట్టూ మహిళా సభ్యులు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా ఆయన సెక్స్‌ గురించి ప్రస్తావించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయన పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇంత నీచంగా ఎలా మాట్లాడగలిగారు అంటూ విపక్షాల వారు మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే..రాష్ట్రంలో జనాభా పెరుగుదల తగ్గింది. అదే సమయంలో మహిళల అక్షరాస్యత పెరిగింది. మహిళలు బాగా చదువుకుంటాం వల్ల జనాభా పెరుగుదల తగ్గిందని చెప్పే క్రమంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయం గురించి ఆయన ప్రస్తావిస్తూ మహిళలు బాగా చదువుకుంటున్నారు. అందువల్ల జనాభా పెరుగుదల తగ్గింది. చదువుకున్న వారికి ఏ సమయంలో ఏం చేయాలో బాగా తెలుసు..అందుకే జనాభా తగ్గుతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలకు ముందు సభలో ఉన్న మహిళా సభ్యులు ఒకింత షాక్‌ కి గురయ్యారు.

పునరుత్పత్తి తగ్గించడం, నిరోధించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించే వివరించే క్రమంలో ఆయన మాట అదుపు తప్పింది. ఇక నితీశ్‌ మాట్లాడిన మాటలపై విపక్షాలు అయితే ఒంటి కాలి పై లేస్తున్నాయి. నిజానికి నితీశ్ ఇలా వ్యవహరించే వ్యక్తి కాదు. కానీ కొద్ది రోజులుగా ఆయన కాంట్రవర్సీలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌ గా మారారు.

నిత్యం ఏదోక వివాదంతో వార్తల్లో ఉంటున్నారు. సోమవారం నాడు కూడా మంత్రి డాక్టర్‌ అశోక్‌ చౌదరి నివాళులు ఆర్పించే సభలో ఆయన తల పై పూలమాల వేసి వార్తల్లో నిలిచారు. అంతకు ముందు ఆయన తన సహ మంత్రి తలపై కొట్టారు.

అంతకు ముందు కూడా ఒకసారి భూమి విధ్వంసం గురించి మాట్లాడాడు. నిజానికి నితీశ్ వ్యవహార శైలిలో ఇలాంటి సాధారణం అవుతున్నాయి. అంతలోనే తాజా వ్యాఖ్యలతో పెద్ద దుమారానికే తెర లేపారు.

Also read: బైక్‌ ని ఢీకొట్టిన కేంద్ర మంత్రి కారు..ఉపాధ్యాయుడు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు