Bihar Floor Test: బిహార్‌ అసెంబ్లీలో బలపరీక్ష.. స్పీకర్‌ పదవి నుంచి ఆర్జేడీ నేత తొలగింపు

సీఎం నితీష్‌ కుమార్-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం.. నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధ్‌ చౌదరీపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత వేటు వేసింది. దీంతో బలపరీక్షపై ఉత్కంఠ నెలకొంది.

Bihar Floor Test:  బిహార్‌ అసెంబ్లీలో బలపరీక్ష.. స్పీకర్‌ పదవి నుంచి ఆర్జేడీ నేత తొలగింపు
New Update

Speaker Awadh Bihari Chaudhary: బిహార్ అసెంబ్లీలో కొత్తగా ఏర్పడిన జేడీయూ అధినేత.. సీఎం నితీష్‌ కుమార్ (Nitish Kumar)-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం.. నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధ్‌ చౌదరీపై (Awadh Bihari Choudhary) ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత వేటు వేసింది. మరోవైపు ఫ్లోర్‌ టెస్ట్‌ (బలపరీక్ష)పై కూడా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్జేడీ ఎమ్మెల్యేలు (RJD MLA) చేతన్‌ ఆనంద్, నీలమ్ దేవి, ప్రహ్లద్ యాదవ్‌ ..ప్రభుత్వం వైపు కూర్చోని ఆ పార్టీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌కు (Tejashwi Yadav) షాకివ్వడం చర్చనీయాంశమైంది.

Also Read: జేఈఈ ఫైనల్ కీ విడుదల

అయితే బిహార్ అసెంబ్లీలో (Bihar Assembly) మొత్తం 243 సీట్లు ఉన్నాయి. ఇందులో ఆర్జేడీ-కాంగ్రెస్ (RJD-Congress) నేతృత్వంలో మహాకూటమికి 110 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక బీజేపీ-జేడీయూ నేతృత్వంలో NDA కూటమికి 125 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. NDA కూటమిలో నలుగురు ఎమ్మెల్యేలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే.. నితీశ్ సర్కార్ సభ విశ్వాసం కోల్పోతుందని.. ప్రతిపక్ష మహాకూటమి అనుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం వైపు వెళ్లడంతో కాంగ్రెస్-ఆర్జేడీకి షాక్ ఇచ్చినట్లైంది.

ఇదిలాఉండగా.. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ (BJP-JDU) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలిచింది. నితీశ్ నేతృత్వంలోని జేడీయూ పార్టికి 43 స్థానాలే వచ్చినప్పటికీ.. 74 స్థానాల్లో గెలిచిన బీజేపీ నితీశ్‌ను ముఖ్యమంత్రిగా చేసింది. అయితే కొన్నాళ్ల తర్వాత బీజేపీతో విభేదించారు. ఆ తర్వాత ఆర్జేడీ (75), కాంగ్రెస్‌ (19) నేతృత్వంలో మరో మహాకూటమిలో చేరిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల ఇండియా కూటమిలోకి వెళ్లిన నితీశ్‌ కుమార్ అక్కడి నుంచి వైదొలగిపోయారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో జతకట్టి బల పరీక్షకు సిద్ధమయ్యారు.

Also Read: రైతుల ధర్నా…మార్చి 12 వరకు ఢిల్లీలో 144 సెక్షన్

#national-news #bihar-cm-nitish-kumar #bihar-floor-test #bihar-assembly #awadh-bihari-chaudhary
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe