MLA Paidi Rakesh Reddy: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్ ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టులో ప్రత్యర్థులు పిటిషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు ఈ పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో పైడి రాకేష్ రెడ్డి తక్కువ ఆస్తులు చూపించారని.. అలాగే కేసుల విషయం కూడా చెప్పలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read: కేసీఆర్ పై రేవంత్ అలా ప్రతీకారం తీర్చుకుంటారా? రెండ్రోజుల్లో జరిగేది ఇదేనా?
ఒకవేళ ఎన్నికల అఫిడవిట్‌లో ఉంది తప్పుడు సమాచారం అని తేలితే.. పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ఇంది. అయితే హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలాఉండగా పార్లమెంటు ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల మధ్య ఎన్నికల పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. మే 13న తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు షాక్