Keskineni Nani : విజయవాడ(Vijayawada) టీడీపీ(TDP) ఎంపీ కేశినేని నాని(Keskineni Nani) మరోసారి వార్తల్లో నిలిచారు. విజయవాడ ఎంపీ టికెట్ తనకు కాకుండా మరొకరికి ఇస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తనకు చెప్పారని కేశినేని నాని అన్నారు. అంతేకాదు చంద్రబాబు తనను పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలను తప్పకుండా పాటిస్తానన్న నాని.. తిరువూరు (Tiruvuru) కు ఇన్ చార్జిగా మరొకరుని నియమించారని తన వద్దకు మాజీ ఎంపీ కొనకళ్ల(Konakalla), ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రఘురాం(Raghuram), ఆలపాటి రాజలు(Alapati Raja) వచ్చి స్వయంగా చెప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పార్టీ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని తనకు సూచించినట్లు తెలిపారు.
ఎంపీ హోదాలోనే చూస్తా:
అయితే రెండు రోజుల క్రితమే తిరువూరు వేదికగా కేశినేని బ్రదర్స్ బల ప్రదర్శనకు దిగారు. జనవరి 7న చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సమావేశం ఏర్పాటులో భాగంగా ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో వీరిద్దరి వివాదం మరింత ముదిరడంతో దూరం పెరిగింది. దీంతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిన అధిష్ఠానం.. కేసనేని నానికి ఎంపీ టికెట్ పూ క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గం సమావేశ బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించామని, నానిని అవేవీ పట్టించుకోవద్దని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తిరువూరు సభ నిర్వహణ వ్యవహారం మొత్తం ఎంపీ హోదాలో తానే చూస్తానని నాని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : Rahul Gandhi: ఈ నెల 14 నుంచి రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర
తమ్ముడికే చంద్రబాబు హామీ:
ఇక 2024 ఎన్నికల్లో కేశినేని నానికి టికెట్ దక్కదనే అభిప్రాయం పార్టీ నేతల్లో నెలకొంది. ఆయన తమ్ముడు కేశినేని చిన్ని వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తుంది. సీటుపై ఇప్పటికే కేశినేని చిన్నికి చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. లోకేష్ సైతం చిన్ని వైపే మొగ్గు చూపటంతో బెజవాడ రాజకీయాల్లో కేశినేని నాని ఒంటరైయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని.. తన కుటుంబం నుంచి కూడా ఎవరూ పోటీలో ఉండరని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే స్వాగతిస్తానని..అంతేకాని బీసీ ముద్ర వేసుకుని అవినీతి చేసే వారికి టికెట్లు ఇవ్వొద్దని నాని పార్టీకి సూచించారు. ఇదే సమయంలో ఆయన సొంత పార్టీపై విమర్శలు చేశారు. తాను లేకపోతే విజయవాడను దోచుకోవాలని చూస్తున్నారని కేశినేని నాని వ్యాఖ్యనించారు. అందుకే తనని పార్టీలోని కొందరు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. బెజవాడలో అవినీతికి పాల్పడితే సహించేది లేదని.. రాజకీయాల్లోకి నీతిపరులు రావాలని కేశినేని నాని పిలుపునిచ్చారు.