Lok Sabha Elections : ఓటు వేస్తే ల్యాప్‌టాప్స్, డైమండ్‌ రింగ్స్.. ఎక్కడంటే

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లా ఎన్నికలు ఓటింగ్ శాతం పెంచేందుకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. ఓటు వేసి.. ల్యాప్‌టాప్‌లు, డైమండ్‌లు ఇస్తామని అంటున్నారు. వీటితో పాటు టీవీలు, ఫ్రీజ్‌లు, స్కూటర్లు, బైక్‌లు కూడా బహుమతులుగా ఇస్తామని చెబుతున్నారు.

Lok Sabha Elections : ఓటు వేస్తే ల్యాప్‌టాప్స్, డైమండ్‌ రింగ్స్.. ఎక్కడంటే
New Update

Bhopal : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్(Voting) నమోదవుతోంది. అయితే మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) లోని భోపాల్‌ జిల్లా ఎన్నికలు ఓటింగ్ శాతం పెంచేందుకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. ఓటు వేసి.. ల్యాప్‌టాప్‌లు(Laptops), డైమండ్‌ రింగులు(Diamond Rings) ఇస్తామని అంటున్నారు. వీటితో పాటు టీవీలు, ఫ్రీజ్‌లు, స్కూటర్లు, బైక్‌లు కూడా బహుమతులుగా ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటించారు. వీళ్లు ఇలాంటి ఆఫర్ ఇవ్వడానికి కూడా ఓ కారణం ఉంది.

Also read: అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. 2024 మొదటి, రెండో విడత పోలింగ్‌లో మధ్యప్రదేశ్‌లో తక్కువ ఓటింగ్ శాతం వచ్చింది. దీంతో భోపాల్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా ముడో దశ ఓటింగ్ శాతం పెంచాలని.. చివరికి ఈ బహుమతులు ఇచ్చే లక్కీ డ్రా ఆఫర్‌ను తీసుకొచ్చారు. ఇందుకోసం.. భోపాల్‌లో పలుచోట్ల కూపన్ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వివరాలను ఓ ఫారంలో నింపి కూపన్ బాక్స్‌లో వేయాలి. ఇందులో గెలిచిన వాళ్లు.. తాము ఓటు వేసినట్లు వేలిపై ఉన్న సిరా ముద్రను చూపించి ఆ బహుమతులు పొందవచ్చు.

Also Read: నాలుగు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు..అప్రమత్తమైన పోలీసులు

#telugu-news #national-news #lok-sabha-elections #madhya-pradesh #bhopal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe