Rajinikanth: భోళా ఎఫెక్ట్.. జైలర్‌కు మరిన్ని థియేటర్లు

భోళాశంకర్ వచ్చింది, ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కంటే 24 గంటల ముందు జైలర్ వచ్చింది. ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు భోళాశంకర్ సినిమా చూసిన జనాలు, జైలర్ బాగుందంటున్నారు. అలా భోళాశంకర్ చలవతో, జైలర్ సినిమా క్లిక్ అయింది. దీంతో ఈ సినిమాకు ఇప్పుడు మరిన్ని థియేటర్లు కేటాయించబోతున్నారు.

New Update
Rajinikanth: భోళా ఎఫెక్ట్.. జైలర్‌కు మరిన్ని థియేటర్లు

More Theatres for Jailer: సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నెల్సన్ డైరక్షన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కింది జైలర్ సినిమా. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు కలిసి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు.

సినిమాకు మంచి టాక్ రావడంతో, థియేటర్లు పెంచాలని నిర్మాతలు దిల్‌రాజు, సునీల్ నారంగ్ ఫిక్స్ అయ్యారు. జైలర్ క్లిక్ అయినందుకు వీళ్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ్టి నుంచి ఆంధ్రాలోని చాలా సెంటర్లలో, నైజాంలోని కొన్ని ఏరియాల్లో జైలర్లకు అదనంగా థియేటర్లు కేటాయించారు.

మరో వైపు జైలర్, భోళాశంకర్ రాకతో.. బ్రో సినిమా థియేట్రికల్ రన్ దాదాపు క్లోజ్ అయింది. ఇన్నాళ్లూ బ్రో సినిమా నడిచిన చాలా స్క్రీన్స్‌ను, ఇప్పుడు జైలర్ సినిమాకు కేటాయిస్తున్నారు. జైలర్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు.

Also Read: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గబ్బర్ సింగ్ రీ-రిలీజ్

Advertisment
తాజా కథనాలు