Deputy CM: ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలి... అసెంబ్లీలో భట్టి విక్రమార్క

గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

New Update
Deputy CM: ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలి... అసెంబ్లీలో భట్టి విక్రమార్క

Telangana Assembly Sessions: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేని అసెంబ్లీలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ చర్చను ప్రారంభించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో తెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పదేండ్ల కాలంగా జరిగిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అన్నారు.
ప్రజలు తమపై నమ్మకం ఉంచి సహేతుకమైన తీర్పునిచ్చారని వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. పవిత్రమైన శాసన సభలో వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని అనుకుంటున్నాం అని తెలిపారు. ఇక నుంచి సహేతుకమైన పాలన అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను విడుదల చేసే శ్వేతపత్రం పై ప్రతీ సభ్యుడు సూచనలు చేయాలని కోరారు. 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్.

ALSO READ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ!


Advertisment
తాజా కథనాలు