Fruit Juice : శరీరాన్ని చురుగ్గా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో పండ్లను చేర్చుకుంటారు. అయితే పండ్లను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందా లేక పండ్ల రసం(Fruit Juice) తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందా అనే ప్రశ్న చాలామందికి వస్తుంటుంది. పండ్లను తినడం(Eating Fruits) వల్ల శరీరానికి చాలా ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియ(Digestion) ను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. తాజా పండ్లను తినడం వల్ల శరీరానికి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ పండ్లు తింటే ఊబకాయం(Obesity), దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోకుండా త్వరగా రిఫ్రెష్ చేస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడే పండ్లలో బెర్రీలు, యాపిల్స్, సిట్రస్ పండ్లు, ద్రాక్ష ఉన్నాయి.
జ్యూస్‌లు తాగడం మంచిదేనా?
- ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పండ్లను కలిపి జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. పండ్లను ఎక్కువ సమయం తినడం కంటే జ్యూస్ చేసుకుంటే సులభంగా తాగవచ్చు. అయితే జ్యూస్‌లో పండ్లలో ఉండేంత ఫైబర్ ఉండదని, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు ప్యాక్‌డ్ జ్యూస్(Packed Juice) ను తాగుతుంటే అందులో చక్కెర, కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
పండ్లు తినడమే బెటరా?
- పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జ్యూస్‌లు చేయడం వల్ల అందులో అనేక పదార్థాలు కలపాల్సి వస్తుంటుంది. దీని వల్ల పండ్లలో ఉండే విలువలు పోతాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పీచుపదార్థం కూడా మిస్ అవుతామని చెబుతున్నారు. తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని, ప్యాకింగ్ చేసిన జ్యూస్‌లు తాగితే మాత్రం సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి : మహిళల్లో ఎక్కువగా కనిపించే వ్యాధులు..నివారణా మార్గాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.