Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ నిందితులు అరెస్టు..

కర్ణాటకలోని రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది. రాష్ట్రం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని బీజేపీ విమర్శలు చేయగా.. దీన్ని మమతా బెనర్జీ సర్కార్‌ ఖండించింది.

New Update
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ నిందితులు అరెస్టు..

కర్ణాటకలోని బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులను పశ్చిమ బెంగాల్‌లో అరెస్టయ్యారు. కోల్‌కత్ సమీపంలోని నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది. రాష్ట్రం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందంటూ మమతా బెనర్జీ సర్కార్‌పై.. బీజేపీ నేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా తీవ్రంగా విమర్శించారు.

Also Read: అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తి..

ఆయన చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్‌ పోలీసులు స్పందించారు. అసత్య ప్రచారం దిగజారిందని.. వాస్తవానికి బెంగాల్ పోలీసులు, కేంద్ర నిఘా సంస్థలు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఆ ఇద్దరు నిందితులను పుర్బా మేదినీపుర్‌లో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మా ప్రజలను సురక్షితంగా ఉంచడంలో ఎల్లప్పుడు అందుబాటులోనే ఉంటాం అంటూ బదులిచ్చారు.

మరోవైపు బీజేపీ చేసిన విమర్శలను మమతా బెనర్జీ సర్కార్ ఖండించింది. ఆ నిందితులు బెంగాల్‌ వాసులు కారని.. ఇక్కడ తలదాచుకునేందుకు వచ్చారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ వెల్లడించారు. రెండు గంటల్లోనే నిందితులు అరెస్టయ్యారని.. మా రాష్ట్రంలో శాంతి వాతవారణం ఉంటే బీజీపీ సహించలేదంటూ విమర్శించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు సురక్షితంగా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసుల సహకారంతోనే వాళ్లని అదుపులోకి తీసుకున్నామని స్వయంగా జాతీయ దర్యాప్తు సంస్థే చెప్పిందని పేర్కొన్నారు.

Also read: కీలక పోస్టుకు రాజీనామా చేసిన బాక్సర్‌ మేరీ కోమ్..

Advertisment
తాజా కథనాలు