Rains in Hyderabad : గత వారం రోజుల నుంచి హైదరాబాద్లో ఎండలు దంచుతుంటే..ఇప్పుడు సడెన్ గా వెదర్ ఛేంజ్ అయింది. ఒక్కసారిగా నగరవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. తొమ్మిది గంటల వరకు కూడా ఎండగానే ఉండగా.. తరువాత నగరం మొత్తం కారు మబ్బులు కమ్మేశాయి. వాతావరణం చల్లబడి.. చల్లని గాలులు వీస్తున్నాయి.
మరోవైపు నగరంలో ఆకాశం మేఘావృతం కావడంతో పలు చోట్ల వర్షం కూడా పడుతోంది. భరత్ నగర్ ,మాదాపూర్ ,టోలిచౌకి , రాజేంద్ర నగర్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన పడుతోంది. దీంతో పాటు పంజాగుట్ట, అమీర్ పేట్, షేక్ పేట్, ఉప్పల్ లలో కూడా చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది.
అయితే నగర వ్యాప్తంగా రానున్న రెండు గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ Hyderabad Meteorological Department అధికారులు వెల్లడించారు. దీంతో పాటు పలు జిల్లాలోను వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, జోగులాంబ, నాగర్ కర్నూల్, మెదక్, సిద్దిపేట్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, ఇంకా భారీ వర్షాలు కూడా పడే ఛాన్స్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది.
Also Read: జనాన్ని పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంటి..వీడియో వైరల్ !