బీ అలర్ట్: రానున్న 2 గంటలు హైదరాబాద్లో జోరు వాన..!
గత వారం రోజుల నుంచి హైదరాబాద్లో ఎండలు దంచుతుంటే..ఇప్పుడు సడెన్ గా వెదర్ ఛేంజ్ అయింది. ఒక్కసారిగా నగరవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. తొమ్మిది గంటల వరకు కూడా ఎండగానే ఉండగా.. తరువాత నగరం మొత్తం కారు మబ్బులు కమ్మేశాయి. అయితే నగర వ్యాప్తంగా రానున్న రెండు గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు పలు జిల్లాలోను భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు..