Telangana: ఈసారి బీసీలకే టీపీసీసీ చీఫ్‌.. మరికొన్ని గంటల్లో AICC సంచలన ప్రకటన!

ఈసారి బీసీలకే టీపీసీసీ పదవి ఇవ్వాలని ఏఐసీసీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అధిష్ఠానానికి.. మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, అంజన్‌ కుమార్ యాదవ్ పేర్లను సూచించారు. మరికొన్ని గంటల్లో టీపీసీసీ చీఫ్‌ పేరును ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

New Update
Telangana: ఈసారి బీసీలకే టీపీసీసీ చీఫ్‌.. మరికొన్ని గంటల్లో AICC సంచలన ప్రకటన!

మరికొన్ని గంటల్లో ఏఐసీసీ సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి బీసీలకే ఈ పదవి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానానికి సీఎం రేవంత్ నలుగురి పేర్లతో లిస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, అంజన్‌ కుమార్ యాదవ్ ఉన్నట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో పీసీసీ చీఫ్‌ ఎవరో ఏఐసీసీ తేల్చే అవకాశం ఉంది. మరికొందరు కీలక నేతలు కూడా తన చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: మావోయిస్టులతో సంబంధాలు నేరం కాదా..! RTVతో సాయిబాబా సంచలన ఇంటర్వ్యూ!

మహేష్ కుమార్ గౌడ్ వైపు సీఎం రేవంత్ మొగ్గు చూపుతున్నారు. రాహుల్‌ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కలిసొస్తుందని మధుయాష్కీ అనుకుంటున్నారు. మరోవైపు యాదవ లాబీయింగ్ లిభిస్తుందని అంజన్‌కుమార్‌ భావిస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్‌గా అవకాశం ఇస్తే ఒకే అని వీహెచ్‌ అంటున్నారు. అయితే రేవంత్ చెప్పింది అధిష్ఠానం వింటుందా లేదా వేరే వారికి అవకాశం ఇస్తుందా అనేదానిపై ఆసక్తి నెలకొంది.

Also read:  లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లు.. 47 మంది భారతీయులకు విముక్తి

#telugu-news #telangana #tpcc #tpcc-chief
Advertisment
Advertisment
తాజా కథనాలు