ఢిల్లీకి భట్టి, ఉత్తమ్.. సీఎం ఎవరో ఈరోజు కొలిక్కి వస్తుందా.. ?

తెలంగాణలో సీఎం ఎవరూ అనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. నిన్న డీకే శివకుమార్ బృందం ఢిల్లీకి వెళ్లగా.. ఇప్పుడు భట్టి, ఉత్తమ్‌ హుటాహుటీనా ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం వీళ్లు మల్లిఖార్జున ఖర్గేతో సహా హైకమాండ్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

New Update
ఢిల్లీకి భట్టి, ఉత్తమ్.. సీఎం ఎవరో ఈరోజు కొలిక్కి వస్తుందా.. ?

Uttam Kumar and Bhatti To Delhi: తెలంగాణలో సీఎం (Telangana CM) ఎవరూ అనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడిలేదు. హుటాహుటీనా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరారు. నిన్ననే డికేశివకుమార్ (DK Shivakumar), పరిశీలకులు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం వీళ్లు మల్లికార్జున ఖర్గేతో (Mallikarjun Kharge) సహా హైకమాండ్‌తో భేటీ కానున్నారు. అయితే ముఖ్యమంత్రి ఎవరూ అనేది ఈరోజు ఫైనల్ కానున్నట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా అధిష్ఠానం చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేసులో రేవంత్‌తో సహా భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు ఉన్నారు. అయితే రేవంత్‌కు సీఎం పదవి ఇచ్చేందుకు కొంతమంది సీనియర్లు ఒప్పుకోవడం లేదని సమాచారం. మరోవైపు మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌ సీఎం కావాలని మొగ్గు చూపుతున్నారని మరికొందరు నేతలు చెబుతున్నారు.

Also Read: తెలంగాణకు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ.. లోక్‌సభలో బిల్లు

అయితే డీకే శివకుమార్ తన నివేదికలో రేవంత్‌ (Revanth)కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం జరిగిన పార్టీలో సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీ చీలకుండా ఉండాలంటే రేవంత్‌నే ముఖ్యమంత్రిగా చేయాలని భావించినట్లు సమాచారం. అలాగే మిగతా సీనియర్లను బుజ్జగించి వారికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ముగ్గురు లేదా నలుగురుని డిప్యూటీ సీఎంలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌ 9న సోనియగాంధీ పుట్టినరోజు సందర్భంగా సీఎంతో సహా కేబినేట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణలో మరో ఎన్నికలకు మోగిన నగారా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు