Bangladesh: బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు.. భయాందోళనలో హిందువులు బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో అక్కడ మైనారిటీలుగా ఉంటున్న హిందువుల్లో భయాందోళన నెలకొంది. హిందువుల దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. దీంతో తమను రక్షించాలని అక్కడి హిందువులు వేడుకుంటున్నారు. By B Aravind 10 Aug 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Bangladesh: 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో సామాజిక, రాజకీయ సమీకరణలు మారుతూ వచ్చాయి. భారత్, పాకిస్థాన్ విభజన తర్వాత బంగ్లాదేశ్ పాకిస్థాన్‌లోనే (Pakistan) కలిసిపోయింది. ఆ సమయంలో బంగ్లాదేశ్ నుంచి లక్షలాది మంది ప్రజలు పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం, మేఘాలయ లాంటి రాష్ట్రాలకు శరణార్థులుగా వచ్చారు. అలాగే పాకిస్థాన్ నుంచి విడిపోయేందుకు 1971లో జరిగిన 'బంగ్లాదేశ్ లిబరేషన్ వార్' సమయంలో కూడా అక్కడ ఎన్నో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పుడు ఎంతోమంది భారత్‌కు వలస వచ్చారు. మరికొందరు అక్కడే ఉండిపోయారు. చివరికి 1971, డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ నుంచి విముక్తి లభించింది. స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ ఏర్పాటైంది. కొన్ని దశాబ్ధాల తర్వాత మళ్లీ బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అక్కడ ఉండే హిందూ మైనారిటీలకు భద్రల లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే బెంగాలీ హిందువులు (Hindus in Bangladesh) తమ గళాన్ని విప్పుతున్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హక్కులకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1971లో బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు పారిపోయి వచ్చిన సుశిల్ గంగోపధ్యాయ్ అనే వ్యక్తి తన గతాన్ని వివరించాడు. ' బంగ్లాదేశ్‌లో మాది పెద్ద కుటుంబం. మాకు చాలా భూములు ఉండేవి. కానీ లిబరేషన్ వార్ సమయంలో.. పాకిస్థాన్ సైన్యం, రజాకార్లు మాపై దాడులకు పాల్పడ్డారు. ఇళ్లు కాల్చేశారు. చాలామందిని చంపేశారు. బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చాక కొన్ని రోజుల తర్వాత అక్కడ వెళ్లాను. కానీ అక్కడున్న మెజారిటీ కమ్యూనిటీ వాళ్లు భారత్‌లోనే శాశ్వత శరణార్థిగా ఉండాలంటూ బలవంతం చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. Also Read: ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ! అనిమా దాస్ అనే మహిళ.. గర్భవతిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్‌కు వచ్చింది. అప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఆమె వివరించింది. ' బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లు తగలబెట్టేశారు. అప్పుడు నా కొడుకు యువకుడు. నా కూతురు కడుపులో ఉంది. ఈ భయంతో మామయ్య మమ్మల్ని భారత్‌కు పంపించారు. అక్కడ జరిగిన హింసాత్మక ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. అప్పటినుంచి కొన్నిసార్లు మాత్రమే బంగ్లాదేశ్‌కు వెళ్లాను. కానీ మళ్లీ అక్కడ నివసించగలననే నమ్మకం లేదు' అని వివరించింది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హరదాన్ బిస్దాస్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ' ఆ సమయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు హిందూ కమ్యూనిటీని భయంలోకి నెట్టేసింది. చాలా మంది తమ సొంత ప్రాంతమైన బంగ్లాదేశ్‌ను వదిలి భారత్‌కు శరణార్థులుగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి.. ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో హిందువులు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారని'తెలిపారు. 1956లో భారత్‌కు వచ్చిన పరేశ్ దాస్ అనే వ్యక్తి తన ఆవేదనను ఇలా పంచుకున్నాడు. ' నా కళ్ల ముందే మా తాతయ్యను నరికి చంపేశారు. ఆ భయంతో మా స్థలాన్ని మేము వదిలేశాం. నా కళ్లముందే నా బంధువుపై వాళ్లు దాడి చేశారు. ఇప్పుడు మేము భారత్‌లో ప్రశాంతంగా ఉంటున్నాం. అక్కడే ఉండిపోయిన మా బంధువులు ఇంకా భయాందోళనలోనే బ్రతుకుతున్నారు. నెల క్రితం.. మా అంకుల్‌ను ఓ భూ వివాదంలో హత్య చేశారని' తన బాధను వర్ణించాడు. Also Read: మార్కెట్ కుప్పకూలుతుందా… భారత్ గురించి హిండెన్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు! 1971 తర్వాత జరిగిన పరిస్థితుల తర్వాత రశ్మోయ్ బిస్వాస్ అనే వ్యక్తి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌లో హిందువుగా ఉండటమే నేరం. స్వాతంత్ర్యం వచ్చాక కూడా అక్కడ భద్రత లేదు. పాకిస్థాన్ సైన్యం, జమాత్ బలగాలు హిందువుల ఇళ్లపై దాడులు చేశాయి. మా కుటుంబ సభ్యులు అక్కడ రాత్రుల్లు దాక్కునే పరిస్థితి వచ్చింది. చాలాసార్లు ఆహారం కూడా దొరికేది కాదు. ఇప్పుడు మేము భారత్‌లో ప్రశాంతంగా ఉంటున్నాం. చాలామంది మా బంధువులు బంగ్లాదేశ్‌లోనే ఉండిపోయారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోని.. బంగ్లాదేశ్‌లో ఉండే హిందువులు ఎలాంటి భయం లేకుండా నివసించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని' తెలిపాడు. #telugu-news #bangladesh #hindus #bangladesh-riots మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి