Bangladesh: రిజర్వేషన్ల కోటాను తగ్గించండి-బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు బంగ్లాదేశ్‌లో వివాదాస్పదంగా మారిన ప్రభత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో గత నాలుగు రోజులుగా ఆందోళనలు చేస్తున్న విద్యార్ధులకు ఉపశమనం లభించినట్టు అయింది. స్వతంత్ర సమరయోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని కోర్టు ఆదేశించింది. By Manogna alamuru 21 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Supreme Court: బంగ్లాదేశ్ కొన్ని రోజులుగా అల్లర్లు, నిరసనలతో ఉద్రిక్తంగా మారింది. ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు 30 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత విధానం ప్రకారం.. 1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో అసువులు బాసిన వారి పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకు 30శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10శాతం మహిళలకు, 5శాతం మైనారిటీ తెగల వారికి, 1 శాతం దివ్యాంగులకు ఇస్తున్నారు. దీన్ని మార్చాలన్న డిమాండ్ ఎంతో కాలంగా వినిపిస్తోంది. ఎట్టకేలకు విద్యార్ధుల డిమాండ్లకు ఉపశమనం లభించింది. వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అక్కడి సుప్రీంకోర్టు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆదేశించింది. ఈ కేసు మీద అత్యవసరంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వతంత్ర సమరయోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించింది. 93 శాతం నియామకాలు ప్రతిభ ఆధారంగానే చేపట్టాలని స్పష్టం చేసింది. మిగిలిన రెండు శాతం మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని సూచించింది. బంగ్లాలో గొడవలు కారణంగా ఇప్పటివరకు 114 మరణించారు. మరో 2500 మందికి పైగా గాయపడ్డారు. దాంతో బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ విధించారు. విద్యార్ధుల అల్లర్లు ఇంకా ఆగకపోవడంతో దానిని ఈరోజు సాయంత్రం వరకు పొడిగించారు. ఇప్పుడు సుప్రీం తీర్పు తర్వాత దీనిని ఎత్తివేయనున్నారు. హింసాకాండ కారణంగా దేశంలోని పలు నగరాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను కూడా నిషేధించారు. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి వలసలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ దేశాలకు వెళ్తున్నారు. Also Read:USA: యూఎస్‌లో భారతీయుడిపై కాల్పులు.. #reservations #supreme-court #bangladesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి