USA: యూఎస్‌లో భారతీయుడిపై కాల్పులు.. అమెరికాలో భారతీయుల మీద దాడుల, కాల్పులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. తాజాగా మరో భారత సంతతి వ్యక్తిపై కాల్పులు జరిగాయి. రోడ్ యాక్సిడెంట్ విషయంలో జరిగిన వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Manogna alamuru 21 Jul 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Atlanta: గావిన్ దసౌర్ ఉత్తరపరదేశ్ ఆగ్రాకు చెందిన వ్యక్తి. ఇతను కొన్నేళ్ళ క్రితం అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ కూడ అయిపోయారు. ఇతను రెండు వారాల క్రితమే ఒక మెక్సికన్ యువతిని వివాహం చేసుకున్నారు. తన భార్యతో కలిసి సరదాగా బయటకు వెళ్ళిన గావిన్‌కు కారు ప్రమాదం ఎదురైంది. వెనుక నుచి వేరే కారు వచ్చి ఇతని కారును ఢీకొట్టంది. దీంతో బాగ కోపం వచ్చిన గావిన్ తన గన్ తీసుకుని అవతలి వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. వేరే డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో అతనికి బాగా కో వచ్చి తన దగ్గర ఉన్న గన్‌తో గావిన్‌పై కాల్సులు జరిపాడు. మెడమీద కాల్పులు చేయడంతో అతను వెంటనే పడిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న గావిన్‌ను అతని భార్య వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపానని నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. అయితే ఈ ఘటన కొంత ఆలస్యంగ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన గురించి అందరికీ తెలిసింది. అమెరికాలోని అట్లాంటాలో ఈ విషాదం సంభవించింది. Also Read:Bangladesh: బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ పొడిగింపు..కనిపిస్తే కాల్చివేత #usa #firing #indian #atlanta మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి