Bandi Sanjay: కేసీఆర్‌ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి .. బండి సంజయ్ సంచలన డిమాండ్

కేసీఆర్‌ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్‌, ఆయన కుటుంబం దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేశారు.

Bandi Sanjay: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక...అన్ని మర్చిపోయారు..!!
New Update

Bandi Sanjay: మాజీ సీఎం కేసీఆర్ (KCR) పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఓడిపోవడంతో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతి నుంచి తప్పించుకోడానికి దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని అన్నారు. వెంటనే కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలి ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా కేసీఆర్‌ కుటుంబం, బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవాలని అని ఆయన కోరారు. ప్రస్తుతం బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

బండి సంజయ్ మాట్లాడుతూ..‘‘కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. వెంటనే వాళ్ల అవినీతిని బయటపెట్టాలి. వాళ్లపై చర్యలు తీసుకోవాలి. అంతకంటే ముందే వాళ్ల పాస్ పోర్టులన్నీ రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలి. లేకుంటే విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది. వీరితోపాటు ఇన్ని అరాచకాలకు కారకులైన కేసీఆర్ సీఎం ఉండగా సీఎంఓలో (CMO) పదవీ విరమణ చేసిన అధికారులు అడ్డగోలుగా సంపాదించి ప్రజల ఆస్తులను దోచుకుని తెలంగాణను సర్వనాశనం చేశారు. వాళ్ల పాస్ పోర్టును కూడా స్వాధీనం చేయాలి. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నందున ఆరోగ్యం కుదటపడే వరకు ఈ విషయంలో ఆయనను మినహాయించాలి’’అని డిమాండ్ చేశారు.

బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ (Congress) చేతిలో తెలంగాణను పెట్టామంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా బీఆర్ఎస్ నేతలు చెబుతుండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ఆ మాటలు అనడానికి సిగ్గుండాలే… తెలంగాణ బంగారు పళ్లెమే అయితే ఫస్ట్ నాడే జీతాలెందుకివ్వలేకపోయారు? 6 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను సర్వనాశనం ఎందుకు చేశారు? ప్రభుత్వ భూములన్నీ ఎందుకు అమ్ముకున్నారు? నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకియ్యలేదు? నిరుద్యోగ భ్రుతి ఎందుకివ్వలేదు.’’అని ప్రశ్నించారు.

ALSO READ:  మా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. హరీష్ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు… దేశమంతా మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ (BJP) గాలి వీస్తోంది. 350 ఎంపీ స్థానాలతో మూడోసారి మోదీ (Modi) అధికారంలోకి వస్తారని సర్వే సంస్థలు చెబుతున్నాయి. తెలంగాణలోనూ మోదీగాలి వీస్తోంది. మనకు పోటీ కాంగ్రెస్ మాత్రమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సోదిలో కూడా ఉండదు. మనం చేయాల్సిందల్లా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ్రుద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఇంటింటికీ తీసుకెళ్లడమే. ఈ విషయంలో కొంత వెనుకబడ్డాం… ఇకపై ప్రతి ఒక్కరూ బీజేపీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలి.’’అని కోరారు.

#bandi-sanjay #kavitha #ktr #telangana-news #brs-party #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe