Bandi Sanjay: వాళ్లు నాతో టచ్‌లో ఉన్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ ఎంపీలు తనతో టచ్‌లో ఉన్నారని ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటూ ప్రశ్నించారు.

Telangana: మెదక్‌ ఘటనపై బండి సంజయ్ సీరియస్‌.. చర్యలు తీసుకోవాలని ఆదేశం
New Update

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు తనతో టచ్‌లో ఉన్నారన్నారు. 'ఈటల రాజేందర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. అందరం కలిసికట్టుగా ముందుకెళ్తాం. ఈటల అభిప్రాయలు కూడా అధిష్టానం గుర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు. ఆరు గ్యారెంటీలు వాళ్లు ఏ విధంగా అమలు చేస్తారు. ఇప్పటికే ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఆరు లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు ?. ఆరు గ్యారెంటీలకు నిధులు ఎక్కడినుంచి తీసుకొస్తారు..?

కాళేశ్వరంపై విచారణ ఏమైంది

కేసీఆర్ హయాంలో డ్రగ్స్ కేసు నిర్వీర్యం అయ్యింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీయాలి. గ్లోబరిన సంస్థ వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంస్థ మీద విచారణ చేపట్టాలి. ప్రభుత్వం TSPSCపై విచారణ ఎందుకు చేయడం లేదు..?. 310 జీవోను సవరించాలి. ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నయిం డైరీ ఏమైంది..? అతడి ఆస్తులు ఎక్కడికి పోయాయి..? నయిమ్‌ కేసుపై విచారణ చేపట్టాలి. ఈ ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ ఎందుకు చేయడం లేదు..? కాళేశ్వరాన్ని సీబీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు అభ్యంతరాలు ఎందుకు..?

Also Read: నిరుద్యోగులకు మంత్రి తుమ్మల శుభవార్త.. ఖమ్మంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్..!!

మళ్లీ బీజేపీదే అధికారం

జ్యూడిషియల్‎ల్లో అనేక కేసులు విచారణ లేక పెండింగ్‎లో ఉన్నాయి. కేంద్రంలో మరోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మునిగిపోయే నావాలు. కేటీఆర్‎కు ఇంకా అహంకారం తగ్గలేదు. కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. స్వార్థ రాజకీయలు, స్వలాభం కోసం వచ్చే నాయకులను బీజేపీ చేర్చుకోదు. బీజేపీతో BRS, కాంగ్రెస్‎కు చెందిన అనేక మంది నేతలు టచ్‎లో ఉన్నారు. బీఆర్ఎస్ ఒక మూర్ఖత్వపు పార్టీ. మీది ప్రాంతీయ పార్టీనా..? జాతీయ పార్టీనా..?కేటీఆర్ చెప్పాలి. బీఆర్ఎస్ కు ఓట్లేస్తే మూసి నదిలో వేసినట్టే' నంటూ బండి సంజయ్ మాట్లాడారు.

Also Read: గంజాయి రవాణాపై నల్గొండ ఎస్పీ చందనా దీప్తి ఉక్కుపాదం

ఇదిలాఉండగా.. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన ఎంపీ బండి సంజయ్.. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. అయితే మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బండిసంజయ్ ఈసారి కూడా కరీంనగర్ నుంచి పోటీ చేయనున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈసారి కరీంనగర్ వాసులు ఎవరికి ఎంపీగా అవకాశం ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

#brs #telugu-news #telangana #bjp #bandi-sanjay
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe