Telangana Election 2023: కరీంనగర్ చరిత్ర తిరగ రాస్తా.. భారీ మెజార్టీతో గెలుస్తా: బండి సంజయ్ నామినేషన్

బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ చరిత్రనే తిరగరాసే టైమొచ్చిందన్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది బైక్ ర్యాలీతో కలిసి బండి సంజయ్ నామినేషన్ వేశారు.

Telangana Election 2023: కరీంనగర్ చరిత్ర తిరగ రాస్తా.. భారీ మెజార్టీతో గెలుస్తా: బండి సంజయ్ నామినేషన్
New Update

Bandi Sanjay Nomination: ధర్మరక్షణ కోసం చివరి శ్వాస దాకా పోరాడుతూనే ఉంటానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. ప్రతి ఇంటికి రక్షకుడిగా ఉంటానన్నారు. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా, ఝాన్సీ లక్ష్మీబాయిలా బయటకు వచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.  ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ మొత్తం కాషాయమైందన్నారు. ఇంతమంది ఎందుకొచ్చారు..? ధర్మం కోసమా..? కాదా..? కరీంనగర్‌లో కాషాయ జెండా ఎగరేద్దాం.. ధర్మాన్ని నిలబెడదామని బండి పిలుపునిచ్చారు. మా చేతిలో ఉండేది కాషాయ జెండానే. మీరిచ్చిన కాషాయ జెండాను కొందరు మర్చిపోయారని బండి గుర్తుచేశారు. ఎంపీగా నా చేతికి కాషాయ జెండా అందించింది మీరే.. 1.2 లక్షల ఓట్లేశారు.

కొందరు కాషాయ జెండాను మర్చిపోయారు

ఏనాడూ నేను వదిలిపెట్టలేదు. కాషాయ జెండాను రెపరెపలాడించాను. ధర్మ రక్షణ కోసం పనిచేశానని బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తిరిగినా... హిందూ ఓట్ బ్యాంక్‌ను ఏకం చేసినా. ఆ తరువాత అన్ని ఎన్నికల్లో బీజేపీకి విజయపరంపర కొనసాగించిన్నారు. చాలా పార్టీలు హిందూ సమాజాన్ని చులకన చేశాయని బండి సంజయ్‌ ఆరోపించారు. నాలో కసి పెరిగింది. ధర్మంపై కక్ష కట్టిన వాళ్ల సంగతి చూడాలనుకున్న అని బండి సంజయ్‌ అన్నారు. 80 శాతం ప్రజలను ఓటు బ్యాంక్‌గా మార్చడమే లక్ష్యంగా పనిచేసిన అన్నారు. 150 రోజులు పాదయాత్ర చేసిన. రైతుల కోసం కాళ్లు చేతులు విరిగినా లెక్క చేయలేదని బండి తెలిపారు.

కేసులు పెట్టినా లెక్క చేయలేదు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే నిరుద్యోగుల కోసం పోరాడి జైలుకు పోయిన అని బండి అన్నారు. 317 జీవో పేరుతో ఉద్యోగులను చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తే వాళ్ల పక్షాన జైలుకు పోయినన్నారు. తెలంగాణలో ఏ వర్గానికి అన్యాయం చేసినా వాళ్ల పక్షాన పోరాడుతా.. నాపై 30కి పైగా కేసులు పెట్టినా లెక్క చేయలేదని బండి సంజయ్‌ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి సివిల్ సప్లయిస్ మంత్రిగా ఉన్నాడు. ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చాడా? అని ప్రశ్నించారు. మందికి ఇండ్లు ఇచ్చారో చెప్పాలని బండి డిమాండ్‌ చేశారు.  ఈరోజు కరీంనగర్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మనోహర్‌రెడ్డి, ధర్మపురి అసెంబ్లీ అభ్యర్ధి ఎస్.కుమార్, చీకోటి ప్రవీణ్ కుమార్ తదతరులతో కలిసి బండి సంజయ్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సర్పగంధ గురించి ఎప్పుడైనా విన్నారా..?

#bandi-sanjay #karimnagar #telangana-election-2023 #nomination
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe