Bandi Sanjay : మోడీ(PM Modi) లేకపోతే భారత్ మరో పాకిస్థాన్‌లా మారే ప్రమాదం ఉందని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్(Karimnagar) బీజేపీ(BJP) మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్(Bandi Sanjay) మాట్లాడుతూ.. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందన్నారు. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్థాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్ ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నాయని అన్నారు. నేను.. ‘హమ్ దో.. హమారే దో’ విధానానికి ఓటేస్తా.. (మేమిద్దరం.. మాకిద్దరనే కుటుంబ నియంత్రణ విధానానికి ఓటేస్తం) అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే.. ‘‘హమ్ చార్.. హమారే చాలీస్’’ (మేం నలుగురం.. 40 మంది పిల్లల్ని కంటాం అనే విధానం) అవుతుందన్నారు. కేసీఆర్(KCR) దేశద్రోహి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికపోతారనే భయంతో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేశారన్నారు. కేసీఆర్ లాంటి దేశద్రోహిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన దేశభద్రత డేటా, దేశద్రోహంపై కేంద్రానికి నివేదిక ఎందుకు పంపలేదు? అని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Telangana : ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించేందుకు ప్లాన్.. బండి సంజయ్!
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేశారు. అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్ గ్యాంగ్ ఒక్కటే అన్నారు. ముస్లింలంతా ఒక్కటై తనను ఓడించాలని కేసీఆర్ పిలుపునిస్తున్నాడని మండిపడ్డారు. హిందూ బంధువులంతా తనను గెలిపించి దమ్మేందో చూపించాలన్నారు.
Translate this News: