Bandi Sanjay: కాళేశ్వరం స్కాంపై సీబీఐ విచారణ.. కాంగ్రెస్‌కు బండి డిమాండ్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కాగ్ తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

New Update
Bandi Sanjay: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

MP Bandi Sanjay: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కాగ్ తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయిస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాలు పెట్టాలని.. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం సహకరిస్తుందని హితవు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించిన వారిలో మాత్రం ఇంకా అహంకారం ఏ మాత్రం తగ్గడం లేదని విమర్శించారు. ఓటమిని చెందిన ఇంకా తామే అధికారంలో ఉన్నామని బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న వీళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.

రూ.500 కోట్ల స్కాం..

భూదాన్ భూముల పేరుతో బీఆర్ఎస్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిజమే అని బండి సంజయ్ అన్నారు. రూ.500 కోట్ల భూదాన్ భూములను కేసీఆర్ కుటుంబం స్వాహా చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం భూదాన్ భూముల స్కాం పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు కాకుండా ధరణి పోర్టల్ ఒక్క కేసీఆర్ కుటుంబానికే ఉపయోగపడిందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ భూములు మింగడానికే ధరణి పోర్టల్ తీసుకువచ్చిందని ఆరోపించారు.

కాళేశ్వరంపై విచారణకు రెడీ..

గత ప్రభుత్వ హయాంలో నిర్మించబడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ ఇటీవల స్పష్టం చేసింది. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని సీబీఐ పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు