చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా మరో ట్వీట్

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా మరోసారి ట్వీట్ చేశారు. బాబు వేసిన పిటిషన్ హైకోర్టులో కొట్టేసిన నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

New Update
చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా మరో ట్వీట్

చంద్రబాబు తరుఫున సీనియర్ న్యాయవాదులు ముగ్గురు వాదిస్తున్నారు. వారిలో సిద్ధార్ధ్ లూథ్రా మొదటివారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈయన మొదట నుంచి బాబు తరుఫున వాదిస్తున్నారు. ఈరోజు బాబు పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది. దీని తర్వాత సిద్ధార్ధ్ చేసిన ట్వీట్ చాలా వైరల్ అవుతోంది. ప్రతీరాత్రి తెల్లవారుతుంది. ప్రతీ ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు పిటిషన్ కొట్టివేయడాన్ని ఉదాహరణగా చూపిస్తూ లూథ్రా ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు బెయిల్ రాకపోతే రేపు వస్తుంది అని చెబుతున్నట్లు అనిపిస్తోంది. దీనిబట్టి చంద్రబాబు కేసును సిద్ధార్ధ్ లూథ్రా అంత తేలికగా వదిలేయడం లేదని...దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్స్ బలంగా వేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును (Chandrababu Naidu) సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబుకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తున్నారు. అయితే, చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న రోజు నుంచి సిద్ధార్థ లూథ్రా అటు ఏసీబీ కోర్టులోనూ, ఇటు ఏపీ హైకోర్టులోనూ వాదనలు వినిపిస్తున్నారు. అప్పటి నుంచి ఆయన వరుసగా ట్వీట్ లను కూడా చేస్తున్నారు. అంతకు ముందు లాయర్ చేసిన ట్వీట్ మీద చాలా చర్చ జరిగింది. సిక్కుల పదో గురువు గురుగోవింద్ సింగ్ సూక్తిని ట్వీట్ చేశారు సిద్ధార్ధ్. అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపుమేర కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైంది.. పోరాటమే శరణ్యం అంటూ ట్వీట్ లో రాసారు. ఇది గురుగోవింద్ సింగ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకి రాసిన జాఫర్ నామాలోని సూక్తి. ఇది ఇది టీడీపీ వర్గాల్లో భయాన్ని కలిగిస్తే...వైసీపీ వర్గాలకు కోపం తెప్పించింది. బాబు తరుఫున వాదిస్తున్న న్యాయవాది కత్తి పట్టమంటున్నారు అంటే కేసు ఓడిపోతామా అని టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. మరోవైపు లూథ్రా అల్లర్లు చేయమంటూ ప్రోత్సహిస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. కొంతమంది లూథ్రా మీద కంప్లైంట్స్ కూడా ఫైల్ చేశాని సమచారం.

ఉదయం చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో తాజాగా సిద్ధార్ధ్ లూథ్రా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ వర్గాలకు అయితే బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి.

Advertisment
తాజా కథనాలు