Ayodhya Ram Mandir : శ్రీరాముడి ఫొటోలు లీక్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోండి.. సీరియస్‌ అయిన ట్రస్ట్‌..

అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలోకి తీసుకొచ్చిన బాలరాముడి విగ్రహం పూర్తి రూపం కనిపించేలా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సీరియస్ అయ్యింది. దీనిపై విచారణ చేసి.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

New Update
Ayodhya Ram Mandir : శ్రీరాముడి ఫొటోలు లీక్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోండి.. సీరియస్‌ అయిన ట్రస్ట్‌..

Ayodhya : యూపీ(UP) లోని అయోధ్య(Ayodhya) లో జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు అయోధ్యకు రామభక్తులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ(PM Modi) తో సహా 7 వేల మందికి పైగా వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు. బాలరాముడి విగ్రహాన్ని కూడా గర్భగుడిలోకి తీసుకొచ్చి కళ్లకు గంతలు కట్టారు. కానీ శుక్రవారం నాడు కళ్లకు గంతలు లేకుండా ఉన్న బాలరాముడి విగ్రహం ఫొటో సోషల్ మీడియా(Social Media) లో వైరలయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ దీనిపై సీరియస్ అయ్యింది.

Also Read: వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ట వరకు అయోధ్య చరిత్ర

చర్యలు తీసుకోవాలి

ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి బాధ్యులను గుర్తించేందుకు చర్యలకు దిగింది. ఫొటోలు అలా వైరల్ కావడంపై శ్రీరామ జన్మభూమి(Sri Ram Janmabhoomi) ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. 'గర్భగుడిలోకి తీసుకొచ్చిన శ్రీరాముడి విగ్రహాన్ని కళ్లకు ఆచ్ఛాదనగా వస్త్రాన్ని కట్టాం. ప్రాణప్రతిష్ఠ రోజున ఆ వస్త్రాన్ని తొలగించాలి. కానీ ఈలోపే శ్రీరాముడి పూర్తి రూపం కనిపించే ఫొటోలు బయటపెట్టడం సరికాదు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరలవుతున్నాయని.. ఈ విషయంపై దర్యాప్తు జరిపుతోంది.. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని' ఆయన డిమాండ్‌ చేశారు.

Also Read: అయోధ్య రామమందిరంలో ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం 

ఎవరు లీక్ చేశారు ?

ఇదిలా ఉండగా.. మైసూరు(Mysore) కు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌(Arun Yogi Raj)  51 అంగుళాల పొడవున్న బాలరాముడి విగ్రహాన్ని తయారుచేశారు. ఆ విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా పసుపురంగు వస్త్రం కట్టి గులాబీదండతో అలంకరణ చేసి గర్భగుడిలోకి తీసుకొచ్చారు. అయితే ఆ వస్త్రాన్ని జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగే రోజున తీయాల్సిఉంటుంది. కానీ అంతకుముందే.. రాముడు పూర్తి రూపం కనిపించేలా ఉన్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అయితే ఆలయ ప్రాంగణంలో నిర్మాణపనుల్లో ఉన్న సిబ్బందే ఈ ఫొటోలను తీసి లీక్‌ చేసుంటారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ట్రస్ట్ ఈ విషయంపై విచారణ చేపట్టింది.

Advertisment
తాజా కథనాలు