author image

Trinath

New Parliament: ఎంపీల కోసం రాజ్యాంగ ప్రతి, నాణెం.. రేపటి నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు
ByTrinath

ఎంపీలతో కలిసి కొత్త పార్లమెంట్‌ భవనంలోకి వెళ్లనున్నారు మోదీ. సెప్టెంబర్ 19న మార్నింగ్‌ పాత పార్లమెంట్‌ భవనంలో ఎంపీలతో కలిసి గ్రూప్‌ ఫొటో సెషన్‌ ఉండగా.. తర్వాత సెంట్రల్‌లో మీటింగ్‌ ఉంది. అక్కడ నుంచి మోదీ రాజ్యాంగాన్ని పట్టుకోని కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇక ఎంపీలకు భారత రాజ్యాంగ ప్రతిని, పార్లమెంటుకు సంబంధించిన పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంపును అందుకుంటారు.

BJP Politics: బీజేపీలో అసంతృప్తి జ్వాల.. అమిత్‌షాపై అలిగిన నేతలు.. ఎవరంటే?
ByTrinath

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై పలువురు కీలక బీజేపీ నేతలు అలిగారు. రాష్ట్ర విమోచన దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌షాపై కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, ఈటలను కలవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఈ లిస్ట్‌లో మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా ఉన్నారు.

Old Indian Parliament: భగత్‌సింగ్‌, నెహ్రు నుంచి మోదీ వరకు.. పాత పార్లమెంట్‌ భవనం చరిత్ర ఇదే..!
ByTrinath

ఉగ్రవాదుల బాంబు దాడులను కూడా భరించి నిలబడిన పాత పార్లమెంట్‌ భవనం ఇక ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుంది. భగత్‌సింగ్‌ విప్లవ పోరాటానికి ఊపిరిలూదిన ఈ భవనం ఇక ఒక చరిత్రగా మిగిలిపోనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ ఇచ్చిన తొలి సందేశం దగ్గర నుంచి ఎన్నో అపూరుప ఘట్టాలు.. కీలక మైలురాళ్లకు కేరాఫ్‌గా ఉన్న పాత పార్లమెంట్‌ బిల్డింగ్‌కు ఇక అల్విదా పలుకుతోంది దేశం.

Vijayashanti: కాంగ్రెస్‌లోకి  రాములమ్మ..? లేడి అమితాబ్‌ ట్వీట్ వెనుక ఆంతర్యం అదేనా?
ByTrinath

బీజేపీ, తల్లి తెలంగాణ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌.. మళ్లీ బీజేపీ.. ఇలా అనేక పార్టీల్లో కీలక నేతగా వ్యవహరించిన లేడీ అమితాబ్‌ సినీ నటీ, మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ మహిళ నేత విజయశాంతి మరోసారి పార్టీ మారుతారాన్న ప్రచారం జరుగుతోంది. సోనియాగాంధీని ప్రశంసిస్తూ తాజాగా రాములమ్మ చేసిన ట్వీట్‌తో పాటు బండి సంజయ్‌, మణిపూర్ అంశాల్లో బహిరంగంగా బీజేపీని వ్యతిరేకించిన విజయశాంతి కొంతకాలంగా కమలం పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు.

TDP VS YCP: పార్లమెంట్‌లో స్కిల్‌  స్కామ్‌  లొల్లి.. తిట్టుకున్న వైసీపీ, టీడీపీ ఎంపీలు!
ByTrinath

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌పై పార్లమెంట్‌లో రచ్చ జరిగింది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు పార్లమెంట్‌లో వాగ్వాదానికి దిగారు. సభకు నల్ల బ్యాడ్జీలతో వచ్చిన టీడీపీ ఎంపీలు చంద్రబాబు అరెస్ట్ అక్రమమని వాదించారు. దీనిపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఈడీ తేల్చిన విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు మిథున్‌రెడ్డి.

Jagan TTD:  శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్‌ని ప్రారంభించిన జగన్..టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను పంపిణీ!
ByTrinath

తిరుపతికి మణిహారంగా నిలవనున్న ఈ శ్రీనివాససేతు ఫ్లైఓవర్‌ని ఏపీ సీఎం జగన్‌ ప్రారంభించారు. మొత్తం 684 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు టీటీడీ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా నిధులు సమకూర్చింది. అటు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు జగన్. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారి ఆలయంలో వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Breaking: తమిళనాడులో బీజేపీకి భారీ షాక్‌.. పొత్తు లేదు పొమన్న అన్నాడీఎంకే!
ByTrinath

'బీజేపీతో పొత్తు లేదు.. పొత్తు విషయానికొస్తే అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ లేదు.. ఎన్నికలు వచ్చినప్పుడే నిర్ణయిస్తాం.. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ లేదు.. ఇదే మా స్టాండ్.. అయితే ఇకపై అన్నామలై మా నేతలను విమర్శిస్తే అన్నామలై తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది' అని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్ చేసిన వ్యాఖ్యలో తమిళనాడులో కమలం పార్టీ కంగుతిన్నది.

IIT JOBS: నెలకు 2 లక్షల జీతం.. ప్రముఖ ఐఐటీలో ఖాళీలు.. వివరాలివే..!
ByTrinath

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ISM ధన్‌బాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ 71 ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది . దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి గడువు అక్టోబర్ 27. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.iitism.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI SCO Recruitment 2023: ఎస్‌బీఐ నుంచి మరో జాబ్‌ నోటిఫికేషన్‌.. 439 పోస్టులకు అప్లై చేసుకోండిలా!
ByTrinath

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతగల అభ్యర్థులు SBI అధికారిక సైట్ sbi.co.in ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 6న ముగుస్తుంది. SBI SCO పరీక్ష ఈ డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది.

IDBI Recruitment 2023: ఉద్యోగార్థులకు అలెర్ట్.. ఐడీబీఐలో 600 ఖాళీలకు నోటిఫికేషన్!
ByTrinath

IDBI రిక్రూట్‌మెంట్ 2023 డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రిక్రూట్‌మెంట్ నోటీసు ప్రకారం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 30న ముగుస్తుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1,000 చెల్లించాలి.

Advertisment
తాజా కథనాలు