బంధించిన చిరుతలను ఒక్కొక్కటికి దట్టమైన అటవీప్రాంతాల్లో వదులుతోంది టీటీడీ. ఆగష్టు 14, ఆగష్టు 17 బోనులో పడ్డ చిరుతలను అటవీశాఖ వదలేసింది. తాజాగా అడవిలో మరో చిరుతను వదలగా.. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మూడు నెలల వ్యవధిలో మొత్తం ఐదు చిరుతలను పట్టుకున్నారు అధికారులు.
Trinath
ByTrinath
ఢిల్లీ పెద్దలు వరుసగా తెలంగాణ బాట పడుతున్నారు. రెండు జాతీయ పార్టీల(కాంగ్రెస్, బీజేపీ)కు చెందిన టాప్ లీడర్లు వరుస పెట్టి తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండడంతో బడా నేతల చూపు తెలంగాణపై పడింది. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. నిజామాబాద్‌లో మోదీ రోడ్ షో ఉండే అవకాశముంది.
ByTrinath
ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపగా.. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయని చెబుతున్నారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. ఆర్టీవీ(RTV)తో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. మరో ఏడుగురు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని.. వారిలో పెద్ద తలకాయాలున్నాయో.. చిన్న తలకాయాలున్నాయో తర్వాత అందరికి తెలుస్తుందని తెలిపారు.
ByTrinath
నేడు తెలుగు రాష్ట్రాల్లో నిరంకుశ పాలన చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాలన చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి, గాంధీ మార్గాన్ని అనుసరించి గ్రామ స్వరాజ స్థాపనకు శ్రీకారం చుట్టారని నాటి సీఎం ఎన్టీఆర్‌ని తెలంగాణ టీడీపీ నేతలు సెప్టెంబర్ 17 సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో సాయుధ పోరాటం జరిగిందని సామా భూపాల్ రెడ్డి చెప్పారు.
ByTrinath
రంగా లక్ష్యలను, ఆశయాలను తాకట్టు పెడుతున్నారని.. పవన్‌కు చురకలంటించే విధంగా విజయవాడ ఐలపురం కన్వేన్షన్ సెంటర్‌లో వంగవీటి రంగ, రాధ అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. రంగా ఆశయాలను, లక్ష్యాలను గౌరవించే రక్తసంబంధీకులు ఎవరు ఉన్నా వారితో కలిసి పనిచేస్తామని.. ఆయన వారసులమని చెప్పుకొని.. ఆ మహనియుడి ఆశయాలకు లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉన్న రక్త సంబంధువులు ఎవరైనా వారిపై పోరాడుతామని చెప్పారు. ఇది పరోక్షంగా రంగా తనయుడు రాధకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యాఖ్యలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ByTrinath
తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ జరుగుతోంది. కార్యకర్తల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగుతోంది. లైవ్‌లో చూడండి
ByTrinath
మంత్రి రోజా వర్సెస్ తెలుగుదేశం నేత అనిత వార్ ఆఫ్ వార్డ్స్ కంటీన్యూ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టును ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడం లేదని రోజా వ్యాఖ్యలను అనిత తిప్పికొట్టారు. రాజకీయాలు మాట్లాడని బ్రాహ్మణి గారిని చూసి వణికిపోతున్నారని ఎద్దెవా చేశారు. ఆమె క్యాండిల్ పట్టుకొని నిరసన తెలియజేసినా చూడలేకపోతున్నారని కౌంటర్ వేశారు.
ByTrinath
టీఎస్ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఫస్ట్ ఫేజ్‌లో 88.74 శాతం సీట్లు నిండాయి. సెప్టెంబరు 20 నాటికి, అడ్మిషన్ కోసం ఎంపికైన దరఖాస్తుదారులు తప్పనిసరిగా ట్యూషన్ ఫీజులు, నిర్దేశిత సంస్థలో స్వీయ నివేదికను చెల్లించాలి. సెప్టెంబరు 28 నాటికి తాత్కాలిక తుది దశ సీట్ల కేటాయింపు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తారు.
ByTrinath
ప్రభుత్వ ఉద్యోగం అందరి కల.. ఈ వారంలో పలు ఉద్యోగులకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. 560 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం CIL రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అటు RBI దేశవ్యాప్తంగా 450 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల కోసం RPSC రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.
ByTrinath
పీవీ సింధు నిబద్ధత, కృషి, అంకితభావం యువ తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. రేపు(సెప్టెంబర్ 17) హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమితి షా ఈ బ్యాడ్మింటన్ స్టార్‌ని కలిశారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోనూ పీవీ సింధు భేటీ అవ్వడం చర్చనీయాంశమవుతోంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/leapord-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kcr-modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rtv-sanjai-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ntrrrr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ranga-radha-pawan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sonia-gandhi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/roja-vs-anitha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/students-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jobs-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pv-sindhu-meets-jpg.webp)