TDP VS YCP: పార్లమెంట్‌లో స్కిల్‌ స్కామ్‌ లొల్లి.. తిట్టుకున్న వైసీపీ, టీడీపీ ఎంపీలు!

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌పై పార్లమెంట్‌లో రచ్చ జరిగింది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు పార్లమెంట్‌లో వాగ్వాదానికి దిగారు. సభకు నల్ల బ్యాడ్జీలతో వచ్చిన టీడీపీ ఎంపీలు చంద్రబాబు అరెస్ట్ అక్రమమని వాదించారు. దీనిపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఈడీ తేల్చిన విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు మిథున్‌రెడ్డి.

New Update
TDP VS YCP: పార్లమెంట్‌లో స్కిల్‌  స్కామ్‌  లొల్లి.. తిట్టుకున్న వైసీపీ, టీడీపీ ఎంపీలు!

AP SKILL DEVELOPMENT SCAM CASE: ఏపీ స్కిల్‌ స్కామ్‌ సెగ పార్లమెంట్‌ని తాకింది. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అక్రమమని టీడీపీ వాదించింది. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని టీడీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తారు. చంద్రబాబు అరెస్ట్‌పై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని.. ఈ అరెస్ట్ చెల్లదంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌(Galla jayadev) విమర్శించారు. అయితే గల్లా మాటలకు వైసీపీ కౌంటర్‌ ఇచ్చింది. అన్ని ఆధారాలు ఉండడంతోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Mithun reddy) రివర్స్ అటాక్ చేశారు. 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఈడీ తేల్చిన విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు మిథున్‌రెడ్డి. ఇది పూర్తిగా అవినీతి కేసు అని, ఐటీ శాఖ చంద్రబాబు పీఏకు నోటీసులు ఇచ్చిందన్నారు. అయితే ఆయన పరారీలో ఉన్నారన్నారు మిథున్ రెడ్డి. సీఐడీ చీఫ్‌ సంజయ్ చెప్పిన విషయాలను మిథున్‌రెడ్డి పార్లమెంట్‌లో చెప్పారు. చంద్రబాబు రూలింగ్‌లో ఉండగానే స్కిల్ స్కామ్‌ జరిగిందన్నారు.

సేవ్ చంద్రబాబు:
అంతకముందు 'సేవ్ చంద్రబాబు' పోస్టర్లతో పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేశారు టీడీపీ నేతలు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనకు లోకేశ్‌ కూడా వచ్చారు. అందరూ కలసి ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం ముందు నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు స్కిల్ స్కామ్‌ కేసులో ఏపీ సీఐడీ మరింత మందిని అరెస్ట్ చేయబోతుందన్న ప్రచారం జరుగుతోంది. మరో ఏడుగురు అరెస్ట్ కావాల్సి ఉందని ఏసీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతోంది. ఈసారి అరెస్ట్ అయ్యేవారిలో పెద్ద తలకాయలే ఉండొచ్చని సమాచారం. నారా లోకేశ్‌ పాత్రపైనా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. తర్వాత అరెస్ట్ అవ్వబోయేది నేనేనంటూ ఇప్పటికీ లోకేశ్‌ హాట్ కామెంట్స్ చేశారు. అయితే బయట జరుగుతున్న ప్రచారంలో తమకు సంబంధం లేదని.. తమ పని తాము చేసుకుపోతామని సీఐడీ చెబుతోంది.
టీడీపీ ఆగ్రహం:
ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ మొదలైన దగ్గర నుంచి ఏపీ సీఐడీపై చంద్రబాబు వర్గం మండిపడుతోంది. సీఐడీ అధికారుల తీరుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అధికారులు సీఐడీ అధికారులుగా వ్యవహరిస్తున్నారా లేక ప్రాంతీయ అధికారులుగా వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుపై నిరాధార ఆరోపణలు చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడానికి ముందు సిఐడి ఐదుసార్లు సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు తన వాదనను వివరించే అవకాశం ఇవ్వకుండా హఠాత్తుగా ఎందుకు అరెస్టు చేశారని సోమిరెడ్డి ప్రశ్నించారు.

ALSO READ: జైలులో చంద్రబాబుకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు: యనమల

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు