author image

Shareef Pasha

By Shareef Pasha

పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు బిల్లులను గవర్నర్ పాస్ చేయలేదని తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే తాజాగా మరోసారి పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.నేను ఎవరికి వ్యతిరేకం కాదు, బిల్లులు ఎందుకు తిరస్కరించాననేది కారణాలు మాత్రమే చెప్పానంటూ గవర్నర్ తెలిపారు.గతంలోనే ఈ సమస్య తీవ్రదుమారం రేపింది.మళ్లీ ఈ సమస్య ఎటువైపు తిరగనుందో వేచి చూడాలి.

By Shareef Pasha

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.ఇకపై ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నారు.దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు అధికారులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

By Shareef Pasha

జనసేనాని అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో రెండుసార్లు వారాహి యాత్ర చేపట్టి అధికార పార్టీ వైసీపీలో వణుకును పుట్టించారు. ఇప్పుడు ఏకంగా మూడో దఫా యాత్రకు రెడీ అవుతున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసైనికులతో సోమవారం (31-07-23) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నేతల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఆగస్టు 3 లేదా 7 తేదీల్లో వారాహి యాత్ర ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

By Shareef Pasha

గత కొన్నిరోజులుగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌తో సహా తెలంగాణ ప్రాంతమంతా తడిసిముద్దయ్యింది.నిన్న మాత్రం స్వల్ప బ్రేక్ ఇచ్చింది. హమ్మయ్యా వర్షాలు తగ్గుముఖం పట్టాయనుకునే సమయానికి మరోసారి హైదరాబాద్ నగరాన్ని సోమవారం (31-07-2023) వర్షం ముంచెత్తింది. దీంతో నగరంలోని ప్రజలంతా తీవ్ర అవస్ధలు పడ్డారు.రాబోయే 48 గంటల్లో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది.

By Shareef Pasha

గతకొంతకాలంగా ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు ఎక్కడినుంచి వచ్చిందనే మ్యాటర్ అప్పట్లో మిస్టరీగా మారింది. ఇవాల్టితో దాని మిస్టరీని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేధించారు. ఈ వస్తువు భారత్‌కు చెందిన రాకెట్‌దేనని ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ (ASA) అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమీపంలో జూలై వారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

By Shareef Pasha

పద్దెనిమిదేళ్ల క్రితం రిలీజైన థియేట్రికల్ మూవీ చంద్రముఖి లకలకలక గుర్తుందిగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈ మూవీ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు తెలుగులో తిరుగులేని మార్కెట్‌ను తెచ్చిపెట్టింది.అప్పట్లో మన స్టార్‌ హీరోలే పాతిక కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టడానికి నానా తంటాలు పడుతుంటే సూపర్‌స్టార్‌ మాత్రం సింగిల్‌హ్యాండ్‌తో పాతిక కోట్ల మార్క్‌ను టచ్‌ చేసిబాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాడు.అంతలా ఈ మూవీ సంచలనాలను క్రియేట్ చేసింది. అయితే అదే సీక్వెల్‌లో వస్తున్న మూవీపై ఫ్యాన్స్ గుర్రుమీదున్నారు. సోషల్‌మీడియా వేదికగా తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

By Shareef Pasha

గ్లోబల్‌వైడ్‌గా ప్రస్తుతం మనకు వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌(AI). ఈ టెక్నాలజీ అద్భుతమైన పనులు చేస్తూ ఎంతగానో పాపులర్ అయ్యింది. ఈ టెక్నాలజీని ఉపయోగించి అన్నిరకాల ఫోటోలను మారుస్తూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో పెట్టిన కొన్నిగంటల్లోనే ఈ ఫోటోలు ట్రెండింగ్‌ అవుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే తమకిష్టమైన నాయకులు, హీరోలు, హీరోయిన్లు ఇలా రకరకాల ఫోటోలను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ఉపయోగించి మార్చుతున్నారు. తాజాగా ఇదే కోవలోకి రాజకీయ నేతలు వచ్చి చేరారు.ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

By Shareef Pasha

దక్షిణ ఇంగ్లండ్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ట్రావెల్ చేస్తున్న కొంతమంది పర్యాటకులు క్యాబిన్‌లో స్ట్రక్ అయిపోయింది. తలకిందులుగా వేలాడుతూ భయాందోళనకు గురయ్యారు అందులో ఉన్న పర్యాటకులు. అమ్యూజ్‌మెంట్ పార్క్ సిబ్బంది రంగంలోకి దిగి ఇరుక్కున్న పర్యాటకులను సురక్షితంగా కిందకు దించారు.దీంతో పెనుప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

By Shareef Pasha

గజ్వేల్‌లో శనివారం (29-07-2023) మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పలువురి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లిని సంకల పెట్టుకున్నట్లు తెలంగాణ ద్రోహులంటూ మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వీరిని మోస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్‌ రెడ్డి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వింటున్నారని నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisment
తాజా కథనాలు