కెప్టెన్‌గా బుమ్రా రీ-ఎంట్రీ, రిస్క్ అవసరమా అంటున్న విశ్లేషకులు.. భారత స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు వెన్నుగాయం కావడంతో జట్టుకు దూరం అయ్యాడు. చాలాకాలం గ్యాప్ తర్వాత క్రికెట్ పిచ్‌లోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇప్పుడు పూర్తిగా కోలుకొని బుమ్రా గేమ్‌కు రెడీ అయిపోయాడు.ఐర్లాండ్‌తో జరిగే 3 మ్యాచ్‌ల T-20 సిరీస్ కోసం అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ టైంలో బుమ్రా రిస్క్ చేయడం అంత అవసరమా అంటూ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు. By Shareef Pasha 01 Aug 2023 in Scrolling స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Bumrah returns as captain: బుమ్రా T-20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఒక టెస్టులో బుమ్రా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కీలకమైన ఆసియా కప్, ప్రపంచకప్‌కు ముందు బుమ్రా మ్యాచ్ ఫిట్‌నెస్ స్థాయిని పరీక్షించేందుకు పెద్దగా ప్రెషర్ లేని జట్టుతో జరిగే సిరీస్‌లో ఆడించబోతున్నారు.ఈ నేపథ్యంలో ఓవైపు టీమిండియా ఫ్యాన్స్ బుమ్రా ఎంట్రీపై హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాత్రం వన్డే ప్రపంచకప్-2023 లాంటి మెగా ఈవెంట్‌కు ముందు కెప్టెన్సీతో ప్రయోగాలు ఎందుకంటూ తమ ఒపీనియన్‌ని డైరెక్ట్‌గానే చెబుతున్నారు. ఐర్లాండ్ బలహీన జట్టే కావొచ్చు కానీ దాదాపు ఏడాది తర్వాత రీ -ఎంట్రీ ఇవ్వబోతున్న బుమ్రాపై అదనపు భారం మోపడం కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. రథసారథిగా రీ-ఎంట్రీ(Bumrah returns as captain) రథసారథిగా జట్టును ముందుండి నడిపించడం అంత తేలిక కాదని ఆన్ ఫీల్డ్‌లోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్‌లోనూ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు ప్రధాన పేసర్ అయినటువంటి బుమ్రా మెగా ఈవెంట్‌కు ముందు బౌలింగ్‌పై కాన్సంట్రేషన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఫిట్‌నెస్, ఫామ్‌ను పరీక్షించడానికే ఐర్లాండ్ సిరీస్‌ను ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుంటున్నప్పటికీ ఇప్పుడే మళ్లీ అతడిని రిస్క్‌లోకి నెట్టడం మంచిదికాదని ప్రశ్నిస్తున్నారు. ఐర్లాండ్ టీంతో జాగ్రత్త అంటున్న నిపుణులు గతేడాది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టును ఓడించినంత పనిచేసిన ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయలేమని పేర్కొంటున్నారు.గాయాలతో సతమతమైన బుమ్రా మ్యాటర్‌లో ఏమాత్రం తేడా వచ్చినా ఆసియా కప్, వరల్డ్‌కప్ వంటి ఈవెంట్లలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారు.చివరిసారిగా గతేడాది సెప్టెంబరు 22న హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన బుమ్రా ఐపీఎల్-2023 ఆడలేదు.ఇదిలా ఉంటే బుమ్రాతో పాటు గాయం నుంచి కోలుకున్న మరో పేసర్ ప్రసిద్ద్ కృష్ణకు ఈ జట్టులో చోటు దక్కింది. ఆసియా క్రీడలకు ఎంపికైన టీమ్ సభ్యులే మళ్లీ ఇక ప్రసిద్ద్ కృష్ణ కూడా ఏడాది క్రితం భారత్ తరుపున ఆడాడు.వీరిద్దరు మినహా సీనియర్ ఆటగాళ్లెవరూ లేకుండా యువ ప్లేయర్లతోనే మిగతా జట్టును సెలెక్ట్ చేశారు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన టీమ్ సభ్యులే దాదాపుగా ఇక్కడున్నారు. టీమిండియా- ఐర్లాండ్ మధ్య ఆగస్టు 18,20,23 తేదీల్లో డబ్లిన్‌లో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ ఈ టీంలో ఆడనున్నారు. #bumrah-returns-as-captain #cricket-player-bumra #pace-bowler #indian-cricket మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి