author image

BalaMurali Krishna

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై పార్లమెంటులో దుమారం తప్పదా ?
ByBalaMurali Krishna

వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ పై బిల్లును కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం లోక్ సభలో ప్రవేశ పెట్టే సూచనలున్నాయి. ఈ బిల్లుపై పార్లమెంటులో విపక్షాలు పెద్దఎత్తున రభసకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన ఈ ఆర్డినెన్స్ ను ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీ బీజేపీ ఇంచార్జ్‌గా బండి సంజయ్ అంటూ జోరుగా ప్రచారం!
ByBalaMurali Krishna

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ, తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షులను మార్చిన అధిష్టానం పెద్దలు తాజాగా జాతీయ కార్యవర్గంలో బండి సంజయ్, సత్యకుమార్‌లకు చోటు కల్పించారు. అయితే బండిని ఏపీ ఇంచార్జ్‌గా నియమంచి మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

బుల్లెట్ దిగిందా? లేదా? డీహెచ్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
ByBalaMurali Krishna

ప్రభుత్వ అధికారిగా ఉంటూనే తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి రాజకీయ అరగేంట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం తథ్యమని స్పష్టంచేశారు.

త్వరలోనే పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా ఎంట్రీ!
ByBalaMurali Krishna

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన 'బ్రో' సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. హిట్ టాక్‌తో దూసుకెళ్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

రెండో వన్డేలో రోహిత్‌ శర్మకు రెస్ట్.. కెప్టెన్‌గా హార్దిక్
ByBalaMurali Krishna

వెస్టిండీస్‌తో రెండో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. రెండు మార్పులతో బరిలోకి దిగింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీలకు రెస్ట్ ఇచ్చింది. దీంతో హార్దిక్ పాండ్య జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

శ్రీనివాస సేతు వంతెన నిర్మాణంపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్
ByBalaMurali Krishna

ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరానికి ప్రపంచం నలమూలాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయి? ఆఫ్కాన్ సంస్థకే మళ్లీ నిర్మాణ బాధ్యతలు ఎందుకిచ్చారు? శ్రీనివాస సేతు వంతెన నిర్మాణంపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్.

అదిరిపోయే ఫీచర్స్‌తో బడ్జెట్‌ ధరకే మోటో G14 ఫోన్
ByBalaMurali Krishna

ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ మోటోరోలా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. మోటో జీ సిరీస్ మోడల్‌లో G14 భారత్ మార్కెట్లోకి మరో మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు ఒకటి నుంచి అమ్మకానికి లభించనుంది.

మా అల్లుడు బంగారం.. కాదు హంతకుడు అంటున్న పోలీసులు
ByBalaMurali Krishna

నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన లహరిరెడ్డి మృతి కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. గుండెపోటుగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు.

తెలంగాణలో ప్రభుత్వం చచ్చిపోయింది.. సర్కార్ నిర్లక్ష్యంతోనే వరదలు
ByBalaMurali Krishna

తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలకపక్షం కక్కుర్తితో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. నిజాం కాలం నాటి చెరువులను బీఆర్ఎస్ నేతలు ఆక్రమించడంతో వరదలు సంభవిస్తున్నాయని ఆరోపించారు.

జూరాల ప్రాజెక్ట్ 31గేట్లు ఎత్తివేత
ByBalaMurali Krishna

తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టుతో పాటు, నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తి కిందకు నీటి వదిలారు. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరంచారు.

Advertisment
తాజా కథనాలు