ఏపీలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. సీఎం జగన్ పాలనపై తరుచూ విమర్శలు చేసే సేనాని పవన్ కల్యాణ్ తాజాగా భారీ వర్షాల నేపథ్యంలో జనసైనికులకు డిజిటల్ క్యాంపెయిన్‌కు పిలుపునిచ్చారు. జగనన్న కాలనీల ప్రస్తుత పరిస్థితిపై ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని సూచించారు.

BalaMurali Krishna
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు అధిష్టానం ప్రమోషన్ ఇచ్చింది. కీలకమైన జాతీయ కార్యవర్గంలో చోటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సీనియర్ నాయకురాలు డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
వచ్చే ఏడాది జరగనున్న మెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి పసికూన జట్టు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. శుక్రవారం పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీంతో ప్రపంచకప్‌లో పాల్గొనే 20జట్లలో ఒకటిగా నిలిచింది.
తిరుపతి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మలయాళం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సీనియర్ హీరో మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. వెంకీ ఆట్లూరి దర్శకత్వంలో 'లక్కీ భాస్కర్' అనే సినిమా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షబీభత్సం కొనసాగుతోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగడంతో నగరమంతా నీటితో నిండిపోయింది. నగర వ్యాప్తంగా వందకు పైగా కాలనీలు వరద నీటితో ముంపునకు గురి అయ్యాయి. ఫైర్ డిప్మార్ట్‌మెంట్‌కు చెందిన సిబ్బంది ప్రాణాలకు తెగించి మరి ప్రజలను కాపాడుతున్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచన చేశారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో తిరిగే రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్లం 50 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. వరదలతో మరో 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే రాష్ట్రంలో అలజడులు సృష్టించే కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వినుకొండ టీడీపీ బాధితులను ఆ పార్టీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, జూలకంటి బ్రహ్మరెడ్డి, జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజా పరామర్శించారు.
పల్నాడు జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకచోట గొడవలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. మొన్న మాచర్ల, నరసరావుపేటలో ఉద్రిక్తతలు తలెత్తగా.. తాజాగా వినుకొండలో రణరంగం తలపించేలా పరిస్థితులు నెలకొన్నాయి.
Advertisment
తాజా కథనాలు